Star Heroine:సాధారణంగా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో లేదో ఇలా విభేదాలు వచ్చి విడిపోతున్నారు. విడిపోయినవారు కొత్త జీవితం కోసం మళ్లీ ఇంకొక కొత్త తోడును వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త తోడు కూడా జీవితానికి కావాల్సిన ప్రశాంతతను ఇవ్వకపోతే..? కోరుకున్న సంతోషం వారి దగ్గర దొరకకపోతే..? ఇక ఆ జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. సరిగ్గా ఇప్పుడు ఒక నటి జీవితం కూడా అలాగే గందరగోళంగా మారిపోయింది. మొదటి భర్త చేసిన గాయాన్ని మాన్పుకోవడానికి, జీవితంలో సంతోషాన్ని తిరిగి పొందడానికి ఆ నటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయినా సరే ఆమె జీవితానికి కావలసిన ప్రశాంతత లభించక.. తిరిగి మళ్లీ ఒంటరి జీవితాన్ని మొదలు పెట్టింది. ఇక ఆమె ఎవరు? ఆమె జీవితంలో ఎదురైన ఆ విషాదగాధ ఏది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
90 ల్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటి జూలీ లక్ష్మి..
ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ కన్నడ నటి జూలీ లక్ష్మి (Juli Lakshmi). కన్నడ , తెలుగు,తమిళ్, మలయాళం, హిందీ చిత్రాలలో నటించిన ఈమె.. 150 కి పైగా చిత్రాలలో నటించింది. నిజానికి ఈమె నేటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. 80,90 నాటి ఆడియన్స్ కు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ పాత్రకైనా సరే విభిన్నమైన రీతిలో ప్రాణం పోసే గొప్ప నటి..తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను కలిగి ఉన్న ఈమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చేసిన పొరపాటు ఆమెకు ప్రశాంతత లేకుండా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. నటి లక్ష్మికి సినిమా పరిశ్రమ కొత్త కాదు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రంగుల ప్రపంచంలో ఉన్న వారే. ఆ విధంగా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే భాస్కర్ (Bhaskar) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత మరొక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సడన్ గా వివాహంలో ఒడిదుడుకులు కారణంగా మొదటి భర్త నుంచి విడిపోయింది లక్ష్మి.
జీవితంలో మూడు పెళ్లిళ్లు.. ఆఖరికి ఒంటరి జీవితమే ..
ఆ తర్వాత మోహన్ అనే మలయాళ నటుడిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అయితే అతడితో కూడా సంబంధాన్ని ఎక్కువగా కాలం కొనసాగించలేకపోయింది. ఇక అతడి నుండి విడాకులు తీసుకున్న ఈమె దర్శకుడు శివచంద్రన్ (Director Siva Chandran) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో ఈమె కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అలా మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించలేకపోయింది. ప్రశాంతత కోసం వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన ఈమెకు ప్రతి చోట నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతూ అదే ప్రశాంతతను ఒంటరి జీవితంలో వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది జూలీ లక్ష్మి.ప్రస్తుతం ఈమె గురించి తెలిసి అభిమానులు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Mukul Dev : ప్రభాస్ విలన్ ఆస్పత్రిలో కన్నుమూత… 54 ఏళ్లకే ఎలా చనిపోయాడంటే..?