టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా తన సర్వీసులను అందిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ప్రజలు గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. గుండు పిన్ను నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాలను గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్లాలి అనుకున్నా రూట్ తెలియకపోతే గూగుల్ ను ఉపయోగిస్తాం. ఫోన్ లో గూగుల్ మ్యాన్స్ ను ఓపెన్ చేసి.. ఎవరి సాయం లేకుండా గమ్య స్థానానికి చేరుకుంటాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూను తీసుకొచ్చింది. దీని ద్వారా అయా మార్గాలను 360 డిగ్రీల కోణంలో చూసే అవకాశం కల్పించింది. ఒకప్పుడు ఈ స్ట్రీట్ వ్యూ కేవలం ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
ఒంటెకు ఉద్యోగం ఇచ్చిన గూగుల్!
స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఓ ఒంటెకు ఉద్యోగం దొరికింది. గూగుల్ కంపెనీ తొలిసారి తన అవసరాల కోసం ఒంటెను ఉద్యోగంలోకి తీసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ ఒంటెకు గూగుల్ ఎందుకు ఉద్యోగం ఇచ్చింది? దానితో ఏం పని చేయించుకుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను అందుటులోకి తెచ్చేలా ప్రయత్నించే సమయంలో అబుదాబిలోని లివా ఎడారి స్ట్రీట్ వ్యూన్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఎడారిలోని అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా చూడాలనుకుంది. అందులో భాగంగానే రఫియా అనే ఒంటెను అద్దెకు తీసుకుంది. దీనికి స్ట్రీట్ వ్యూ ట్రెక్కర్ ను అమర్చింది. లివా ఎడారి అంతా తిప్పుతూ ప్రకృతి దృశ్యాలను 360 డిగ్రీలలో షూట్ చేసింది. గూగుల్ మ్యాపింగ్ మిషన్లకు సాయం చేయడంలో రఫియా ఎంతో ఉపయోగపడింది. గూగుల్ మ్యాపింక్ కు సాయపడిన మొదటి జంతువుగా రఫియా గుర్తింపు తెచ్చుకుంది.
ఉదయం 6 గంటల నుంచే పని మొదలు
లివా ఎడారి అనేది 100 కిలో మీటర్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఇది అబుదాబి నగరానికి ఆగ్నేయంగా ఉంది. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి. వీటన్నింటినీ స్ట్రీట్ వ్యూలో పొందుపరిచేలా గూగుల్ ప్రత్నించింది. ఇందుకోసం బెస్ట్ లైటింగ్ తో స్ట్రీట్ వ్యూ దృశ్యాలను షూట్ చేసేందుకు రాఫియా ఉదయం 6 గంటలకే ఇసుకలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టేది. ఎడారిలోని ఇసుక దిబ్బలు, ఒయాసిస్, తోటి ఒంటెలు, ఇసుక తుఫానులతో పాటు ఒంటెల నీడలను స్ట్రీట్ వ్యూ ట్రెక్కర్ ద్వారా చిత్రీకరించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు అన్నీ గూగుల్ స్ట్రీట్ వ్యూలో అందుబాటులో ఉన్నాయి.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్, ఇక ఆ ప్రాంతాలకూ మెట్రో వచ్చేస్తోంది!
2007లో అందుబాటులోకి గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్
గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం చాలా విజువల్స్, ఫోటోలను ట్రెక్కర్ తో కారులో షూట్ చేశారు. లివా ఎడారిలో మాత్రం ఒంటె ద్వారా షూట్ చేశారు. లివా ఎడారితో పాటు యుఏఈలోని మరో రెండు ప్రదేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూలో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు కాగా, మరొకటి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా.
Read Also:ఆ రెండు రైల్వే స్టేషన్లు క్లోజ్, ఇండియన్ రైల్వే షాకింగ్ డెసిషన్, ఎందుకంటే?