TJ Harshavardhan: సమాజం మారుతుంది.. ఒకప్పుడు భర్తలు వేధిస్తున్నారని భార్యలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కాపాడమని బతిమలాడేవారు. కేవలం మహిళల కోసమే గృహహింస చట్టాన్నీ ప్రవేశపెట్టింది న్యాయస్థానం. కానీ, ఇప్పుడు భార్యల కంటే భర్తలే ఎక్కువ గృహహింస బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో భర్తలను భార్యలే వేధిస్తున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. డబ్బు ఎక్కువ సంపాదించాలని కొందరు.. వేరొకరితో ఎఫైర్ పెట్టుకొని.. విడాకులు ఇవ్వాలని మరికొందరు భర్తలను వేధిస్తున్నారు. ఇలాంటి వేధింపులకు సెలబ్రిటీలు సైతం అతీతమేమి కాదు.
తాజాగా తన భార్య తనను వేధిస్తోందని కన్నడ డైరెక్టర్, నిర్మాత హర్షవర్ధన్ టీజే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు మూడేళ్ళ క్రితం హర్షవర్ధన్ ప్రేమ వ్యవహారం ఎంత పెద్ద రచ్చ అయ్యిందో అందరికీ తెల్సిందే. కన్నడ నటి శశికళ.. హర్షవర్ధన్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి.. వాడుకొని వదిలేశాడని 2022 లో బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హర్షవర్ధన్ తనకు 2021 నుంచి పరిచయమని.. ఆ పరిచయం ప్రేమగా మారిందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లు శారీరకంగా కలిశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడని, ఎన్నిసార్లు అడిగినా పెళ్లి గురించి మాట్లాడడం లేదని, తనకు న్యాయం చేయమని ఫిర్యాదులో తెలిపింది. ఇక ఈ కేసును పరిశీలించిన పోలీసులు హర్షవర్ధన్ తో శశికళకు 2022 లో వివాహం జరిపించారు.
Tollywood Industry: బాలయ్యకు సన్మానం.. ఎటొచ్చిన తలనొప్పి..!
మూడేళ్ళ తరువాత హర్షవర్ధన్ భార్య వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చింది. మేము మాట్లాడుకున్న మాటలను రికార్డ్ చేసి బెదిరించడం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తన నచ్చక నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసరికి.. నా ఆఫీస్ కు వచ్చి కారంపొడితో నాపై దాడికి పాల్పడింది. ఇక నేను మోసం చేసానని పోలీసులకు ఫిర్యాదు చేసి నన్ను అరెస్ట్ చేయించింది. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించింది” అని తెలిపాడు.
అంతేకాకుండా పెళ్లి చేసుకున్నదగ్గర నుంచి తనకు ప్రశాంతత లేదని, మెంటల్ గా టార్చర్ పెడుతుందని ఆయన ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాకుండా ఇంటికి చాలామంది నిర్మాతలను, డైరెక్టర్లను పిలిచి.. తనను బయటకు గెంటేస్తుందని.. రెండు మూడు గంటల తరువాత లోపలికి పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. యూట్యూబర్స్ తో కుమ్మక్కై నా పరువు బజారుకీడుస్తాను అని, ఇతర మహిళలతో ఉన్న తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టిస్తానని బెదిరిస్తుందని తెలిపాడు. ఇక ఈ హర్షవర్ధన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు శశికళను విచారిస్తామని తెలిపారు.