BigTV English

WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !

WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !

WTC – Pakistan: వెస్టిండీస్ – పాకిస్తాన్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో వెస్టిండీస్ జట్టు 120 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని 1-1 తో సమం చేసుకుంది. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో గెలుపుతో వెస్టిండీస్ జట్టు చరిత్ర సృష్టించింది. 21 వ శతాబ్దంలో పాకిస్తాన్ గడ్డపై ఆ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం. చివరిసారిగా 1990లో వెస్టిండీస్.. పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ విజయం సాధించింది.


Also Read: Boxer Mary Kom: కుంభమేళాలోనే మేరీకోమ్ బాక్స్ంగ్ పంచ్‌ లు !

ఇప్పుడు మళ్లీ 35 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ను వారి సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. ఇది ఓటమితో పాకిస్తాన్ జట్టు డబ్ల్యూటీసి పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున పడబోతోంది. ఇప్పటికే చివరి స్థానంలో ఉన్న పాకిస్తాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 14 మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు కేవలం 5 మ్యాచ్లలోనే గెలుపొందింది. మరో 9 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ఈ పట్టికలో సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్లలో 8 విజయాలు సాధించి మొదటి స్థానంలో ఉండగా.. 17 మ్యాచ్ లలో 11 మ్యాచ్ లు గెలుపొంది ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది.


ఇక 19 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లు గెలుపొంది ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. కాగా వెస్టిండీస్ – పాకిస్తాన్ రెండవ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 41 ఓవర్లలో 163 రన్స్ చేసి ఆలౌట్ అయింది. గుడాకేష్ మోతే ఒక్కడే హాఫ్ సెంచరీ తో రాణించాడు. ఈ మొదటి ఇన్నింగ్స్ లో పాక్ బౌలర్ నమన్ అలీ హైట్రిక్ సహా.. 6 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జట్టుని కోలుకోలేని దెబ్బతీశాడు.

అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 47 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ రిజ్వాన్ 49 రన్స్ చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. గోమేల్ వార్రికన్ 4, గుడాకేష్ మోతే 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 9 పరుగుల లీడ్ తో తన 2 వ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన వెస్టిండీస్ 66.1 ఓవర్లలో 244 పరుగులకు ఆల్ ఔట్ అయింది.

బ్రాత్ వైట్ 74 బంతులలో 52 పరుగులతో రాణించాడు. అమీర్ జంగూ 30, టెవిన్ ఇమ్లాచ్ 35 ఓ మోస్తరు పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇక అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. మూడవరోజు ఆట ప్రారంభమైన కాసేపటికి 5 వ వికెట్ ని కూడా కోల్పోయింది.

Also Read: WI vs Pak 2nd Test: వీడెవర్రా బాబు.. గుడ్డలు లేకుండానే క్రికెట్‌ ఆడేస్తున్నాడు ?

అంతేకాదు పాకిస్తాన్ బ్యాటర్లు మూడవరోజు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. వెస్టిండీస్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడంతో మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది పాక్. ఇక ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లలో మొత్తంగా 19 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతేకాకుండా రెండవ టెస్ట్ లో విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు వార్రికన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×