HBD Bobby Deol :బాబీ డియోల్ (Bobby deol).. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాలో విలన్ గా నటించి, ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా, నేషనల్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు రాబట్టిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమా విజయం సాధించడంతో అటు బాబీ డియోల్ కెరియర్ కూడా ‘యానిమల్’ కి ముందు.. ‘యానిమల్ ‘ కి తర్వాత అన్నట్టుగా మారిపోయింది.అంతే కాదు ఆయన ఆస్తులు కూడా యానిమల్ కి ముందు ఆ తర్వాత అన్నట్టుగానే మారినట్లు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు నుండి ఫస్ట్ లుక్ పోస్టర్..
ముఖ్యంగా ఈ సినిమాలో జమల్కుడు పాటతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు బాబీ. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో బాలకృష్ణ(Balakrishna )హీరోగా నటించిన డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఇప్పుడు సక్సెస్ అవ్వగా.. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం .అంతే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నట్లు.. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
యానిమల్ తో ఒక్కసారిగా పాపులారిటీ అందుకున్న బాబీ డియోల్..
ఇకపోతే యానిమల్ సినిమాకి ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తూ అడపాదడపా ప్రేక్షకులను మెప్పించిన ఈయన యానిమల్ సినిమా సక్సెస్ అవ్వడంతో గుర్తింపుతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.5కోట్లు తీసుకున్నారు. ఇక ఈయన ఇప్పటివరకు సినిమాల ద్వారా 66 కోట్ల రూపాయల వరకు కూడబెట్టినట్లు సమాచారం
భార్య నుండి భారీ ఆస్తులు..
ఇకపోతే బాబీ డియోల్ కి భార్య నుండి భారీగా ఆస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. 1996 లో బాబీ.. తాన్య(Tanya )అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో రూ.6కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నారు. తాన్య ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర ఆహుజా కూతురే ఈమె. దేవేంద్ర తన కుమార్తెకు దాదాపు రూ.300 కోట్ల ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇక 2010లో ఈయన మరణించారు. ధాన్య కూడా ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తోంది. అంతేకాదు సొంతంగా ఫర్నీచర్ స్టోర్ కూడా కలిగి ఉంది. ఇక బాబీ డియోల్ ఆస్తి రూ.66 కోట్లు కాగా ఆయన భార్య తాన్య ఆస్తి దాదాపు రూ.300 కోట్ల పై మాటే అని సమాచారం.ఏది ఏమైనా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి కారణంగా మరింత కోటీశ్వరుడిగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.6 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.