Tamannaah:మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా (Tamannaah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె చేసిన పనికి కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో తమన్నాకు అండగా కర్ణాటక రాష్ట్ర మంత్రి నిలవడం గమనార్హం. మరి తమన్న ఏం చేసింది? అసలు ఆమెపై కన్నడిగులు ఫైర్ అవ్వడానికి గల కారణం ఏమిటి? మంత్రి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
బ్రాండ్ ప్రమోటర్ గా తమన్నా.. కన్నడిగుల నుండి వ్యతిరేకత..
అసలు విషయంలోకెళితే.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీరికి ఉన్న ఇమేజ్ ను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి అటు పలు సంస్థలు కూడా కోట్ల రూపాయలను వెచ్చించి మరీ వీరితో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమన్నాకి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న కారణంగా ఆమెను ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ఐకానిక్ మైసూర్ శాండిల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది .ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక బ్రాండ్ గా ఉన్న మైసూర్ శాండిల్ సబ్బుకి ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక నటులను ఎందుకు ఎంపిక చేయలేదని కన్నడిగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమన్నాకు అండగా కర్ణాటక మంత్రి..
అయితే ఈ విషయంపై కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి ఎం.పీ.పాటిల్ (M.P.Patil ) రియాక్ట్ అవుతూ తమన్నకు అండగా నిలిచారు. అంతేకాదు ఆయన నాలుగు కారణాలను కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుత మార్కెట్లో పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయాన్ని తాము సమర్ధించామని తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమపై తమకు అత్యంత గౌరవం ఉందని, కానీ కె ఎస్ డి ఎల్ సంస్థ కర్ణాటకను దాటి తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే పాన్ ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా ఎంపిక చేసామని ఆయన తెలిపారు. . ఇక ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ..” తమన్న ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆమెకు జాతీయస్థాయిలో మార్కెట్ ఉంది. అలాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే ఉత్పత్తిని మరింతగా విస్తరించవచ్చు. ఇక కె ఎస్ డి ఎల్ కర్ణాటకేతర ప్రాంతాలలో ముఖ్యంగా తూర్పు, ఉత్తర భారత దేశంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే తమన్నా కి హై ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్ కేర్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది. ఆమెకు ఈ విషయంలో మరింత అనుభవం ఉంది. తద్వారా సులువుగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందవచ్చు. ఇక తమన్నా ఎంపికను మార్కెటింగ్ నిపుణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మాత్రమే తీసుకున్నాము అందుకే పీఎస్ డబ్ల్యూ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదించింది” అంటూ మంత్రి తెలిపారు. ఇకపోతే ఇందుకోసం తమన్నా రూ.6.2 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకోబోతోంది.
ALSO READ:Bollywood: షాకింగ్.. మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్.!