Bollywood: 2020 సంవత్సరం తలుచుకోగానే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా భయభ్రాంతులకు గురిచేసింది అంటే.. మళ్లీ కరోనా పేరు వినగానే బాబోయ్ అంటూ హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఆ సంఘటనలు ఇప్పటికీ కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. శవాలను పూడ్చి పెట్టడానికి కూడా స్థలం లేనంతగా శవాలు దిబ్బలుగా పడి ఉన్న దృశ్యాలు తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులో భయం పుడుతుంది. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి కాస్త బయటపడ్డాక ఊపిరి పీల్చుకున్న ప్రజలకు మళ్ళీ ఇప్పుడు కొత్త భయం మొదలైందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఈ కరోనా భయం ఒక్కసారిగా సంచలనం సృష్టింస్తోంది.బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న కొంతమంది హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడడం, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
మరో బాలీవుడ్ నటికీ కరోనా పాజిటివ్..
ఇక మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వదిన ప్రముఖ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) తో పాటు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడిప్పుడే వారు ఈ కరోనా నుంచి కోలుకుంటున్నారు. అయితే ఇంతలోనే మరో బాలీవుడ్ నటి తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. ఆమె ఎవరో కాదు నికితా దత్త (Nikita Dutta). ‘జువెల్ థీఫ్’ ఫేమ్ నికితా తాజాగా తన పోస్ట్ ద్వారా.. “నాకు, మా అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఇది ఎక్కువ కాలం మాతో ఉండకపోవచ్చు”అంటూ షేర్ చేసింది. “కొద్ది రోజులు క్వారంటైన్ తో మేము ఆరోగ్యంగా బయటకి వస్తాము” అని కూడా తెలిపింది. ఇకపోతే మహారాష్ట్రలో 2025, మే నెలలో 95 కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.
నికితా దత్త సినిమాలు..
నికితా దత్త విషయానికి వస్తే.. ఈమె హిందీ సినిమాలు, హిందీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫెమినా మిస్ ఇండియా 2012 ఫైనల్ కు చేరిన ఈమె ‘లేకర్ హమ్ దీవానా దిల్’ తో నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో సహాయక పాత్ర పోషించింది .ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ అనే షో తో టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఏక్ దూజే కే వాస్తే లో సుమన్ తివారీ పాత్ర పోషించి, భారీ పాపులారిటీ అందుకున్న ఈమె 2018 లో గోల్డ్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించింది నికిత దత్త. అటు బుల్లితెర ఇటు వెండితెర పై భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు కరోనా భారిన పడిందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.