Kannappa Comic Book 3..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప (Kannappa ) మూవీ ఎన్నో రోజులు నుంచీ వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ 27న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉన్నారు. తెలుగు,తమిళ,హిందీ, మలయాళ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి స్టార్ సెలబ్రిటీలను ఇందులో తీసుకున్నారు మంచు విష్ణు (Manchu Vishnu). అలా ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు,అక్షయ్ కుమార్ (Akshay kumar), మోహన్ లాల్(Mohan lal), ప్రభాస్(Prabhas), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), ముఖేష్ రుషి,శరత్ కుమార్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు.
కన్నప్ప మూవీ నుండి కామిక్ బుక్ 3 విడుదల..
అయితే అలాంటి కన్నప్ప మూవీకి సంబంధించి తాజాగా యానిమేటెడ్ కామిక్ బుక్-3 రిలీజ్ అయింది.. అలాగే ఈ ఫైనల్ ఎపిసోడ్ యూట్యూబ్ లో మే 16 నుండి అందుబాటులోకి రానుంది.ఇక ఇందులో భక్తి , విధి, ప్రేమ,త్యాగం అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. “హర హర మహాదేవ్” అనే నినాదంతో కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్ తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే కన్నప్ప మూవీకి సంబంధించి యానిమేటెడ్ సిరీస్ లో అద్భుతమైన విజువల్స్ ని చూపించారు.ఇందులో ఉండే విజువల్స్ కళ్ళకు ఇంపుగా కనిపించడంతో ప్రేక్షకులు ఈ యానిమేటెడ్ సిరీస్ ని చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు సిరీస్ లను చూసిన ప్రేక్షకులు మూడో సిరీస్ ని చూడడానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా కన్నప్ప మూవీ పై మరింత హైప్ పెరిగి సినిమాకి ప్రమోషన్ కూడా గట్టిగానే అవుతుంది.
ALSO READ: HariHara Veeramallu Release Date : వీరమల్లు ఆన్ జూన్ 12… ఈ డేట్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?
అంచనాలు పెంచేస్తున్న యానిమేటెడ్ వీడియో..
అటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కన్నప్ప యానిమేటెడ్ సిరీస్ చూసిన చాలామంది ప్రేక్షకులు థియేటర్లలో విడుదల కాబోయే కన్నప్ప మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.అంతేకాదు ప్రస్తుతం కన్నప్ప మూవీకి సంబంధించి యానిమేటెడ్ సిరీస్ చూసిన చాలామంది నెటిజన్స్ పాజిటివ్ కామెంట్లు పెడుతూ థియేటర్లలో విడుదల కాబోయే కన్నప్ప సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కన్నప్ప మూవీ లో శివుడి పరమ భక్తుడైనటువంటి కన్నప్ప రియల్ స్టోరీని తెరమీద చూపించబోతున్నారు.ఈ సినిమా ఇప్పటికే ఎన్నో విమర్శలకు గురవుతూ ఫైనల్ గా విడుదలకు సిద్ధమైంది.మరి విడుదలయ్యాక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరొకవైపు ఈ సినిమాకు పోటీగా మంచు మనోజ్ (Manchu Manoj) భైరవం ఉంటుందని అందరూ అనుకున్నారు. అన్నదమ్ముల మధ్య తెరపై కూడా పోటీ ఉండబోతుందని కామెంట్లు చేశారు.. అయితే అనూహ్యంగా మే 30 నుండి విష్ణు తప్పుకోవడం జరిగింది. మే 30న మంచు మనోజ్ ‘భైరవం’ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.