HariHara Veeramallu Release Date :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ ఎంతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. తన అధికారాన్ని ఉపయోగించి, ప్రజలకు మేలు చేసే పనులు చేస్తూ ఎంతోమందికి అండగా నిలిచారు. ఇకపోతే రాజకీయాలలో బిజీ కావడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నుంచి ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , ‘OG’ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ (Director Krish) మొదట ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ఏమైందో తెలియదు కానీ క్రిష్ సడన్గా సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothi Krishna) రంగంలోకి దిగారు.
జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు..
ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం దాదాపుగా ఇప్పటివరకు 13 సార్లు వాయిదా పడింది. ఇక ఇప్పుడు జూన్ 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ విడుదల తేదీల్లో ఇక మార్పు లేదని కూడా స్పష్టం చేశారు మేకర్స్. అయితే ఈ జూన్ 12వ తేదీనే ఎందుకు డేట్ ఫిక్స్ చేశారు అని అటు అభిమానులలో కూడా అనుమానాలు రేకెత్తగా.. తాజాగా ఊహించని విషయం ఒకటి తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఎప్పుడో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించింది మొదలు రాజకీయాల్లోకి రావాలి అని, ప్రజలకు సేవ చేయాలని, దాదాపు దశాబ్ద కాలానికి పైగా పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కూడా చిరంజీవి అనుకోని కారణాలవల్ల కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష పవన్ కళ్యాణ్ నుంచి పోలేదు. దాంతో ఆయన మళ్ళీ కొంతకాలం తర్వాత ‘జనసేన’ అనే పార్టీని స్థాపించి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడ్డారు.
జూన్ 12 ప్రత్యేకత ఏంటంటే..?
నిద్రాహారాలు మాని.. జీవితాన్ని ప్రజల కోసమే పణంగా పెట్టి, ఎట్టకేలకు 2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్.అలా ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత జూన్ 12వ తేదీన “పవన్ కళ్యాణ్ అనే నేను” అంటూ తనకలను సాకారం చేసుకున్నారు. అలా జూన్ 12వ తేదీన ప్రమాణస్వీకారం చేసి ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆయన ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత సహకారమైన సందర్భంగా ఈ జూన్ 12వ తేదీన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య జూన్ 12న అందులోనూ పవన్ కళ్యాణ్ ఏపీ డీసీఎం గా మారిన తర్వాత విడుదల కాబోతున్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Balakrishna : ఛీ ఛీ బాలయ్య ఇవేం పనులు.. పద్మభూషణ్ వెంటనే వెనక్కి తీసుకోవాలి..!