Ariana Viviana – Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). భారీ అంచనాల మధ్య ఈ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమా నుంచి క్యారెక్టర్స్ కి సంబంధించి పోస్టర్స్ రివీల్ చేస్తున్నా.. ట్రోల్స్ మాత్రం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రభాస్, కాజల్ అగర్వాల్, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, సురేఖ వాణి, అర్పిత్ రాంక, శరత్ కుమార్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25 2025న చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
కన్నప్ప నుంచి అరియానా, వివియానా ఫస్ట్ లుక్ పోస్టర్..
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి సోమవారం కూడా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తామని ఇదివరకే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు విష్ణు పిల్లలైన మంచు అరియానా (Manchu Ariana), మంచు వివియానా(Manchu Viviana) లుక్ పోస్టర్లను విడుదల చేశారు. అంతేకాదు ఈరోజు మంచు విష్ణు కవల పిల్లలైన ఈ అమ్మాయిల పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఇలా రెండు సందర్భాలు ఒకేరోజు కలిసి రావడంతో ఇది కాస్త ఇప్పుడు హైలెట్ గా మారింది.
గిరిజన వేషధారణలో విష్ణు కూతుళ్లు..
ఇకపోతే తాజాగా కన్నప్ప సినిమా నుంచి ఈ ఇద్దరి అమ్మాయిల పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. శ్రీకాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో వీరిద్దరూ కనిపించనున్నారు. తాజాగా పోస్టర్ విడుదల చేయగా.. ఆ పోస్టర్లో..” పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసమే” అని చూపించడం జరిగింది. ఈ మేరకు మంచు విష్ణు కూడా పోస్ట్ చేస్తూ తన కుమార్తెలిద్దరికీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నోట్ వదిలారు.
కవల కూతుళ్ళపై ప్రేమ కురిపించిన మంచు విష్ణు..
మంచు విష్ణు తన పోస్టులో.. “పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్ ను చూడడానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు మంచు విష్ణు. మొత్తానికైతే మంచు విష్ణు కూతుర్లు ఇద్దరు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇకపోతే మంచు విష్ణు ఇద్దరు కూతుర్లు మాత్రమే కాదు, ఈయన కొడుకు అవ్రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి అవ్రామ్ లుక్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
My heart swells with pride as I share #Ariaana & #Viviana in #Kannappa🏹. I can’t wait for everyone to witness the magic, my little mommies create on the screen! ❤️ Happy Birthday Ari Vivi. I Love you to the moon and back.❤️#HarHarMahadevॐ #KannappaMovie@themohanbabu… pic.twitter.com/yYBIOPv1Pn
— Vishnu Manchu (@iVishnuManchu) December 2, 2024