EPAPER

Kantara 2 : క్రేజీ ప్రాజెక్ట్ ‘కాంతారా2’లో స్టార్ హీరో… ఎన్టీఆర్ తరువాత రిషబ్ శెట్టి తోనే ఆ పాత్ర

Kantara 2 : క్రేజీ ప్రాజెక్ట్ ‘కాంతారా2’లో స్టార్ హీరో… ఎన్టీఆర్ తరువాత రిషబ్ శెట్టి తోనే ఆ పాత్ర

Kantara 2 : ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మర్చిపోలేని సినిమా ‘కాంతారా’. కన్నడ సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా రేంజ్ లో ‘కేజిఎఫ్’ పెంచితే, ఆ రేంజ్ సినిమాలను అందించగల సత్తా కన్నడ సినీ పరిశ్రమకు ఉందనే నమ్మకాన్ని ఇచ్చింది ‘కాంతారా’. ఆ సినిమాకు ఫ్రీక్వెల్ గా ‘కాంతారా 2’ అనే సినిమా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టితో పాటు మరో స్టార్ హీరో భాగం కాబోతున్నాడు అనే వార్త సంచలనంగా మారింది. మరి ఆ స్టార్ హీరో ఎవరు? అనే విషయంలోకి వెళ్తే…


‘కాంతార 2’లో మరో స్టార్ 

ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి, దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న మూవీ ‘కాంతార’. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించిన రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతర 2’ మూవీని తీసే పనిలో పడ్డారు. కానీ ఈ మూవీ సీక్వెల్ కాదు ప్రీక్వెల్. అంటే ‘కాంతార’ సినిమాలో మనం చూసిన స్టోరీకి ముందు జరిగిన కథ అన్నమాట. అత్యంత ప్రతిష్టాత్మకంగా రిషబ్ శెట్టి రూపొందిస్తున్న ఈ సినిమాలో పలువురు స్టార్లు భాగం కాబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


ముఖ్యంగా వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మోహన్ లాల్. ఈ మలయాళ స్టార్ హీరోను రిషబ్ రీసెంట్ గా కలిశారు. పైగా సోషల్ మీడియాలో ఆ ఫోటోను కూడా షేర్ చేయడంతో ‘కాంతార 2’ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు అన్న అనుమానాలకు బలం చేకూరింది. ఆయనతో పాటే మరికొంత మంది స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించబోతున్నారని అంటున్నారు.  తాజాగా ఆయన పాత్ర ఇందులో ఎలా ఉండబోతోంది అనే వార్తా బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ తర్వాత ఈ హీరో తోనే ఆ పాత్ర.. 

మోహన్ లాల్ కు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా సైడ్ క్యారెక్టర్లు పోషించడానికి ఇలాంటి స్టార్స్ పెద్దగా ఇష్టపడరు. కానీ మోహన్ లాల్ మాత్రం కంటెంట్ బాగుంటే చాలు ఎలాంటి పాత్ర చేయడానికి అయినా వెనకాడరు. గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి పెద్దనాన్న పాత్రలో నటించి మెప్పించారు. అ తరువాత సొంత ఇండస్ట్రీలో ‘బ్రో డాడీ’లో కూడా తండ్రిగా నటించారు. కానీ ఇతర ఇండస్ట్రీలో ఆయన అలాంటి పాత్రల జోలికి వెళ్లలేదు.

‘కాంతార’ సినిమాలో మాత్రం రిషబ్ శెట్టికి తండ్రిగా మోహన్ లాల్ నటించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. కాగా ‘కాంతారా 2’ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఈ మూవీ 1000 కోట్లు రాబట్టడం ఖాయమని నమ్ముతున్నారు మేకర్స్.

Related News

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Big Stories

×