Kantara Chapter 1: కన్నడ మూవీ కాంతార(Kantara).. 2022 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి రిషబ్ శెట్టి (Rishab Shetty ) డైరెక్షన్ తోపాటు హీరోగా కూడా నటించారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కన్నడలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇతర భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేశారు.ఇక విడుదలైన ఇతర భాషల్లో కూడా కాంతార మూవీ (Kantara Movie ) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) ని అనౌన్స్ చేశారు. కాంతార సినిమాకి వచ్చిన ఆదరణతో దీనికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి కూడా రిషబ్ శెట్టినే డైరెక్షన్ చేస్తున్నారు. అయితే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం పెద్ద ప్లాన్ వేస్తున్నారట మేకర్స్. ఆస్కార్ ని లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ సినిమాకి సంబంధించి ఆస్కార్ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్న కాంతారా చాప్టర్ వన్..
మన తెలుగు సినిమాల్లో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు అందుకున్నది రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) మూవీలోని నాటు నాటు పాటకి గానూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి , లిరిసిస్టు అయినటువంటి చంద్రబోస్ లు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రెటీలైతే లేరు. అలా మొదటి జాబితాలో వీళ్లే ఉన్నారు. అయితే ఆస్కార్ అవార్డు కోసం ఈసారి చాలామంది కలలు కన్నారు.అలా ఆస్కార్ రేసులో సూర్య డిజాస్టర్ మూవీ అయినటువంటి కంగువ(Kanguva) కూడా ఉంది.కానీ దీన్ని రేసులో నుండి తప్పించేశారు. అయితే ఆస్కార్ అవార్డే లక్ష్యంగా పెట్టుకొని తాజాగా కాంతారా చాప్టర్ 1 మూవీని హోంబలే ఫిల్మ్స్(Hombale Films) వాళ్ళు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అయితే కాంతార సినిమా తెరకెక్కించిన సమయంలో ఈ సినిమాపై అన్ని అంచనాలు పెట్టుకోలేదట. ఏదో సాదాసీదా గానే సినిమాని ముగించేసారట. కానీ సినిమా విడుదలయ్యాక దీనికి ఎంత ఆదరణ లభించిందో చెప్పనక్కర్లేదు.అయితే కాంతార కి వచ్చిన ఆదరణతో కాంతర చాప్టర్ 1(Kantara Chapter 1) ని భారీ అంచనాలతో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు వెనకాడడం లేదని తెలుస్తోంది.
ఆస్కార్ రేస్ లోకి దింపే ప్రయత్నం..
సినిమాని ఆస్కార్ (Oscar) రేసులో ఉంచడమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్న కాంతార చాప్టర్ 1 మేకర్స్ సినిమా కోసం భారీగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారట.అలాగే ఈ సినిమాలో ఎక్కువ అట్రాక్ట్ చేసేది యుద్ధ సన్నివేశాలు.. అయితే ఈ యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా రావడం కోసం రిషబ్ శెట్టి (Rishab Shetty)ఇప్పటికే గుర్రపు స్వారీ,కళరిపయట్టు వంటివి కూడా నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆస్కార్ రేసులో ఈ సినిమా ఉండేలా, ఆ సినిమాలో అన్ని రకాల అంశాలను అత్యున్నతంగా పొందపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా, బడ్జెట్ ఎంతైనా సరే అన్ని సన్నివేశాలు పర్ఫెక్ట్ గా రావాలని ముందు నుండే చెబుతున్నారట. ఇప్పటికే ఆస్కార్ ని టార్గెట్ గా పెట్టుకొని సినిమా డైరెక్షన్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక కాంతార చాప్టర్ 1 అక్టోబర్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వచ్చిన వెంటనే.. ఆస్కార్ రేసులో ఉండేలా సినిమాకి అన్ని రకాల ప్రణాళికలు ఇప్పటినుండే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో హోంబలే ఫిల్మ్ మేకర్స్ ఆస్కార్ లెవెల్ లో సినిమాకి ఎలా ప్రమోషన్స్ చేయాలి అనే దానిపై కూడా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ గా హోంబలే ఫిల్మ్స్ మేకర్స్ కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) ని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే దీన్ని ఆస్కార్లో నిలపడం కోసం ప్రమోషన్స్, స్క్రీనింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆస్కార్ రేసులో కాంతారా చాప్టర్ 1 ని తీసుకు వెళ్లడమే లక్ష్యంగా మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది.. ఆస్కార్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా అనేది విడుదలయితే గానీ చెప్పలేము.