Ravi Teja 76 Movie: ఒక సినిమా సెట్స్‌పైకి ఉండగానే మరొక సినిమాను లైన్‌లో పెడుతున్నారు హీరోలు. సీనియర్, యంగ్ అని తేడా లేకుండా ప్రతీ హీరో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా ఒకటే సారి రెండు, మూడు స్క్రిప్ట్స్‌ను ఓకే చేస్తున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. కెరీర్‌లో కొన్నాళ్లు గ్యాప్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అంతే కాకుండా వీలైనంత త్వరగా షూటింగ్స్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీతో బిజీగా ఉన్న రవితేజ.. తన తరువాతి మూవీని ఫీల్ గుడ్ డైరెక్టర్‌తో ఓకే చేశాడని బయటికొచ్చింది.
ఒకటే ఫోకస్
మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మినిమమ్ మాస్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఇక వారికి మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్రామిస్ చేస్తూ ‘మాస్ జాతర’ అనే సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించడానికి వచ్చేస్తున్నాడు రవితేజ. మామూలుగా ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు, మూడు ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తాడు రవితేజ. కానీ అలా చేయడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో కాస్త స్లో అయ్యాడు. అందుకే ప్రస్తుతం పూర్తిగా ‘మాస్ జాతర’పైనే ఫోకస్ పెడుతున్నాడు. పైగా తన కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కుతుంది కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాడు మాస్ మహారాజ్. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండడంతో మరో మూవీకి ఓకే చేశాడట రవితేజ.
ఫీల్ గుడ్ సినిమాలు
‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ రైటర్ కమ్ డైరెక్టర్.. ఇప్పుడు రవితేజ కెరీర్‌లో 76వ సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడట. కిషోర్ తిరుమల (Kishore Tirumala) చివరిగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాను తెరకెక్కించింది. కానీ ఆ మూవీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొందరు మాత్రం సినిమా పర్వాలేదు అన్నా కూడా అది కిషోర్ తిరుమల సినిమా అని చాలామందికి రెజిస్టర్ అవ్వలేదు. అలాంటి దర్శకుడి చేతిలో తన 76వ చిత్రం బాధ్యతలు పెట్టాడట రవితేజ.
Also Read: ఆ గాయాన్ని మళ్లీ గెలుకుతున్నారు.. సమంతతో విడాకులపై చైతన్య ఫస్ట్ టైం రియాక్షన్
స్క్రిప్ట్ రెడీ
రవితేజ (Ravi Teja) ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలతోనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. కానీ కిషోర్ తిరుమల మాత్రం పూర్తిస్థాయిలో ఒక్క కమర్షియల్ సినిమాను కూడా డైరెక్ట్ చేయలేదు. అలాంటి ఈ కాంబోలో మూవీ అంటే ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘మాస్ జాతర’ కూడా మే 9న విడుదలకు సిద్ధమయ్యింది. కానీ ‘విశ్వంభర’ కూడా అదే రోజు విడుదల ఉండడంతో ‘మాస్ జాతర’ను పోస్ట్‌పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రవితేజ. మొత్తానికి రవితేజ 76వ సినిమాపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.