BigTV English
Advertisement

Kantara Chapter 1 : కాంతార మూవీ టీంకు రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు..

Kantara Chapter 1 : కాంతార మూవీ టీంకు రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు..

Kantara Chapter 1 : కన్నడ డైరెక్టర్ & హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు. కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఈ సినిమాకు ప్రీక్వెల్గా మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘కాంతారా: చాప్టర్ 1’ కోసం కన్నడ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సీక్వెల్ సినిమాను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోస్తాలోని ప్రత్యేకమైన ప్రాంతాల్లో తెరకేక్కుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసే పనిలో టీమ్ అంతా బిజీగా ఉన్నారు. ఈ టీమ్ మొత్తం ముదూరులో షూటింగ్ ముగించుకుని కొల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కొల్లూరు వైపు వెళ్తుండగా మినీ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన టైమ్ లో ఈ బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్నారని సమాచారం. స్వల్ప గాయాలు తగిలాయని తెలుస్తుంది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ కాంతారా 1 మూవీని హోంబాలే ఫిలింస్ ద్వారా విజయ్ కిరగందురు నిర్మిస్తున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘కాంతార’కి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 చిత్రం రాబోతోంది. బస్సు బోల్తా పడడంతో ఆ టీమ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే ప్రమాద బాధితుల ఆరోగ్య సమాచారం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి అందరూ క్షేమంగానే ఉన్నారని అంటున్నారు. రీసెంట్ గానే డైరెక్టర్ రిషబ్ వచ్చే ఏడాదిలో రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు. మొదటగా వచ్చిన కాంతారా సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. దాంతో ప్రీక్వెల్ గా రాబోతున్న సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×