E-Paper
Advertisement

Kantara Prequel :  కాంతార ప్రీక్వెల్ ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..

Kantara Prequel :  కాంతార ప్రీక్వెల్ ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..
Advertisement
Kantara Prequel

Kantara Prequel : ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ లెక్కలు మార్చిన చిత్రం కాంతార. అప్పటివరకు చిన్న సినిమాలను చిన్నచూపు చూసేవారు సైతం.. కంటెంట్ సాలిడ్ గా ఉన్న చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే ఆలోచించుకునే పరిస్థితి తీసుకువచ్చింది ఈ చిత్రం. భాష మనది కాదు.. పద్ధతులు మనది కావు.. అయినా సరే థియేటర్లలో నిలబడి ఆడింది. ఈ మూవీతో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి టాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయ్యాడు.

2022 సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఇది ఎక్కువ కన్నడ నేటివిటీకి దగ్గరగా అక్కడి ఆచారాలను పద్ధతులను హైలైట్ చేసే విధంగా సాగే థ్రిల్లర్ డ్రామా . రెస్పాన్స్ బాగా రావడంతో ఒకే ఒక వారం వ్యవధిలో మిగిలిన భాషల్లోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డివోషనల్ హిట్ గా 400 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. కన్నడ సినిమా మార్కెట్ ని ఓ రేంజ్ లో నిలబెట్టింది కాంతార మూవీ అనడంలో డౌట్ లేదు.

Advertisement

మొదటి పార్ట్ పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో దీనికి సీక్వెల్ ని కూడ తీయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెక్స్ట్ రాబోయే చిత్రం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న తరుణంలో.. వచ్చేది సీక్వెల్ కాదు ఫ్రీక్వల్ అని మరొక ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి సడన్‌గా మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ,టైం ని కూడా కన్ఫామ్ గా చెప్పేశారు.

నవంబర్ 27 మధ్యాహ్నం 12:25 నిమిషాలకు

Advertisement

కాంతార పార్ట్ 1 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అనౌన్స్మెంట్ పోస్టర్ తో పాటుగా కింద ఇచ్చిన ఒక లైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏమిటో తెలుసా.. ‘అది కేవలం వెలుగు మాత్రమే కాదు.. అది దర్శనం..’ మంచి డివోషనల్ టచ్ తో.. మూవీలో ఏదో ట్విస్టును ఇండికేట్ చేస్తూ ఉన్న ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×