BigTV English

Kareena Kapoor: ఎంతటి వారైనా మెడలు వంచాల్సిందే.. కరీనాకపూర్ షాకింగ్ పోస్ట్ వైరల్..!

Kareena Kapoor: ఎంతటి వారైనా మెడలు వంచాల్సిందే.. కరీనాకపూర్ షాకింగ్ పోస్ట్ వైరల్..!

Kareena Kapoor.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రతి సినిమాతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎన్నో క్రైమ్ డ్రామా మూవీలలో నటించిన ఈమె అంతకుమించి తన నటనతో మెప్పించింది. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ముఖ్యంగా ఎంతటి వారైనా దాని ముందు తలలు వంచాల్సిందే అంటూ పోస్ట్ పెట్టడంతో దేనిని ఉద్దేశించి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి కరీనాకపూర్ షేర్ చేసిన ఆ ఇన్ స్టా స్టోరీలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


సమయం ముందు ఎంతటి వారైనా తలలు వంచాల్సిందే..

ప్రస్తుతం కరీనా రాసుకొచ్చిన ఇన్స్టా స్టోరీలో ఏముంది అనే విషయానికి వస్తే..” సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే జీవితం మనం మెడలు వంచి పాఠాలు నేర్పిస్తుంది.అలాగే అందరికంటే మనమే తెలివైన వాళ్ళము అనుకుంటాము. కానీ జీవితంలో మనకు మనం అనుకునే సిద్ధాంతాలు,: ఊహగానాలు ఏవీ కూడా నిజాలు కావు” అంటూ ఒక హార్ట్ ఎమోజిని కూడా జోడించింది. ప్రస్తుతం కరీనాకపూర్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా ఇది చూసిన నెటిజన్స్ కరీనాకపూర్ దేనిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కరీనాకపూర్ దేనిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిందో తెలియాల్సి ఉంది.


కరీనా కపూర్ కెరియర్ , వ్యక్తిగత జీవితం..

కరీనా కపూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నతీమణులలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె మొదటిసారి ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అశోక, కభీ ఖుషీ కభీ గమ్ అనే సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వీటితో పాటు చమేలీ, ఓంకార, దేవ్, జబ్ వియ్ మెట్, బాడీగార్డ్, రా.వన్, ఇడియట్స్, భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు అందుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తోటి నటుడు సైఫ్అలీఖాన్ (Saif AliKhan) ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఈ జంటకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీగా ఉన్న ఈమె అటు సినిమాలలో కూడా అడపాదడపా నటిస్తోంది.

దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురైన కరీనా భర్త..

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం కరీనాకపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ నిందితుడి చేతిలో దాదాపు ఆరుసార్లు కత్తి పోటుకు గురయ్యాడు. ఇక ఇటీవలే సర్జరీ చేయించుకొని క్షేమంగా ఇంటికి వచ్చిన విషయం తెలిసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×