BigTV English

Own House Purchase Strategy: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..

Own House Purchase Strategy: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..

Own House Purchase Strategy| ఆర్థిక భద్రత, సామాజిక స్థాయి పెరుగుదలకు సొంత ఇల్లు ఎంతో అవసరమని అందరూ భావిస్తారు. అందుకే సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి కల. ఉన్నంతలో సొంతంగా ఒక ఇల్లు కొనాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది అవసరంగానూ మారుతుంది. కొద్దిగా ప్రణాళికతో వ్యవహరించి, ముందుగానే జాగ్రత్తగా ఉంటే సొంత ఇల్లు కొనడం సాధ్యమే. సొంత ఇల్లు కొనేందుకు చిన్న వయసు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.


పట్టణాల్లో ఉద్యోగులు 30 ఏళ్లలోపే సొంత ఇల్లు కొనేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా దంపతులిద్దరూ ఆర్జిస్తున్న వారు సొంత ఇల్లు కలను త్వరగా నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత కొన్నేళ్లపాటు వేచి చూసి, ఆదాయంలో స్థిరత్వం రాగానే తొలి పెట్టుబడిగా ఇంటినే ఎంచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికే 5-6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి ఉంటారు కాబట్టి, ఖర్చులు ఎంత అవుతున్నాయి? ఎంత మిగులుతోంది? అనే స్పష్టత వారికి వచ్చి ఉంటుంది. జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఇల్లు కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి? ఇల్లు కొన్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి అనే విషయాలపై స్పష్టత కూడా రావాలి.

రుణ చెల్లింపుల వ్యవధి


చిన్న వయసులోనే ఇంటి రుణం తీసుకోవడం వల్ల దానిని తిరిగి చెల్లించేందుకు కావాల్సినంత వ్యవధి దొరుకుతుంది. రుణ వ్యవధిని నిర్ణయించుకునేందుకు కొంత వెసులుబాటూ ఉంటుంది. వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) భారమూ అంతగా ఉండదు. ఫలితంగా ఖర్చుల కోసం పెద్దగా ఇబ్బందీ ఉండదు.

అదాయ పన్నులో వడ్డీ మొత్తానికి రాయితీ 
ఆదాయపు పన్ను సెక్షన్‌ 24 ప్రకారం గృహరుణ వడ్డీకి చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. సెక్షన్‌ 80సీకి లోబడి మొత్తం రూ.1,50,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం నేపథ్యంలో ఇప్పుడు ఈ మినహాయింపు అంత ముఖ్యం కాదనే చెప్పాలి. పాత పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక భవిష్యత్తులో రద్దు చేసే అవకాశాలున్నాయి. అందుకే ఇంటి కొనుగోలు చేయాలనుకునేవారు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవాలి.

Also Read: సిబిల్ స్కోర్‌తో పెళ్లి క్యాన్సిల్.. వరుడికి షాకిచ్చిన అత్తమామలు

విపరీతంగా పెరిగిపోతున్న ఇళ్ల ధరలు, భూమి ధరలు
ఇళ్ల ధరలు ఇప్పటికే పెరిగాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. చిన్న కుటుంబాల సంఖ్య మన దేశంలో పెరిగిపోతున్న తరుణంలో ఇల్లు కొనేవారి సంఖ్యా అధికంగానే ఉంటుంది. మరోవైపు నిర్మాణ వ్యయం కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద నగరాల్లో రూ. కోటి పెడితే తప్ప చిన్న ఇల్లు రాని పరిస్థితి. కాబట్టి, ఇల్లు కొనాలనే ఆలోచన ఉన్నవారు తొందరపడితేనే మంచిదని నిపుణుల సూచన.

ఇల్లు, భూమి ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గే సందర్భాలు చాలా తక్కువే. ఈ నేపథ్యంలో మీకు ఆర్థిక రక్షణ ఇవ్వడంతోపాటు… పెట్టుబడి వృద్ధికీ సాయపడుతుంది. చిన్న వయసులోనే ఇంటిపై పెట్టుబడి పెడితే.. కాలం గడుస్తున్న కొద్దీ వారు పెట్టుబడి మొత్తంకన్నా ఎన్నో రెట్లు అధిక ప్రయోజనం లభిస్తుందనడంలో సందేహం లేదు.

ఆర్థిక భద్రతగా..
ఉద్యోగం వచ్చిన కొత్తలో ఖర్చులు ఎంతవుతున్నాయనే విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. ఇది ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా ఆదాయంలో స్థిరత్వం రాగానే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన వస్తే రుణం తీసుకొని, ఇల్లు కొన్నారనుకోండి. దీనికి వాయిదాలు చెల్లించడం వల్ల మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. అద్దెకు బదులుగా సొంత ఇల్లు కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించడం ద్వారా ఒక సుదీర్ఘ పెట్టుబడిని ప్రారంభించినట్లు అవుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. పైగా సొంత ఇల్లు ఆర్థిక భద్రతనూ ఇస్తుంది.

వడ్డీ రేట్లు
గత కొంతకాలంగా గృహరుణ వడ్డీ రేట్లు గరిష్ఠంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గించింది. దీంతోపాటు మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి బ్యాంకులు అర శాతం వరకూ రాయితీని ఇస్తున్నాయి. కాబట్టి, ఒకసారి బ్యాంకును సంప్రదించి, మీకు ఎంత రుణం వస్తుందనేది తెలుసుకొని, సొంత ఇల్లు కలను నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించండి.

ఆర్బిఐ నిర్ణయంతో తగ్గనున్న వడ్డీ రేట్లు
ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేటు పావు శాతమే (25 బేసిస్‌ పాయింట్లు) అయినప్పటికీ గృహరుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలావరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలవ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. 9 శాతం వడ్డీ అనుకుంటే నెలకు రూ.44,986 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం రూ.44,186కు తగ్గనుంది. అంటే దాదాపు నెలకు రూ.800 ఆదా అవుతుంది. గృహరుణం తీరడానికి ఇంకా పదేళ్ల సమయం ఉందనుకుంటే 120 నెలలకు రూ.800 చొప్పున దాదాపు రూ.96 వేల వరకు మిగులుతుంది.

రుణ గ్రహీతలకు నిపుణుల సూచనలు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణ గ్రహీతల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం. రెండోది కాలవ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షన్‌ ఎంచుకోమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
పై ఉదాహరణనే మళ్లీ తీసుకుంటే.. రూ.50 లక్షల రుణంపై 9 శాతం వడ్డీ రేటు కింద 20 ఏళ్లకు 57.96 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో 8.75 శాతం వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐని స్థిరంగా కొనసాగిస్తే.. దాదాపు 10 నెలల గడువు తగ్గుతుంది. దీంతో వడ్డీ మొత్తం 53.6 లక్షలకు తగ్గుతుంది. తద్వారా రూ.4 లక్షలపైనే ఆదా అవుతుంది. కాబట్టి రుణ కాలవ్యవధి ఆప్షన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×