BigTV English

Rangarajan Attack Case: రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు

Rangarajan Attack Case: రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు

Rangarajan Attack Case: తెలంగాణలో వీసాల వెంకన్నగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు మొయినాబాద్ పోలీసులు. వీర రాఘవ‌రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అక్కడి నుంచి వీర రాఘవ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.


ఇదిలావుండగా వీర రాఘవరెడ్డి అరాచకాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. రామరాజ్యం పేరుతో తనకి ప్రత్యేక చట్టం ఉందంటూ ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి సమానంగా తన సైన్యం పని చేస్తుందని అందులో వ్యాఖ్యానించారు. మరోవైపు వీర రాఘవరెడ్డి వ్యవహార శైలిలో మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. హిందువులపై దాడికి పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రంగరాజన్‌పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రంగరాజన్ మద్దతుదారులు. హిందువుల కోసం కష్టపడి పని చేస్తున్న అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేశాడంటే ఇతని వెనుక ఎవరున్నారు? బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వీర రాఘవరెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్నారు మొయినాబాద్ పోలీసులు.


శుక్రవారం తెల్లవారుజామున చిలుకూరు ఆలయం సమీపంలో ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్‌పై దాడి చేశాడు వీర రాఘవరెడ్డి, ఆయన మద్దతుదారులు. ఈ ఘటన తర్వాత ఆయన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వెంటనే పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు.

ALSO READ: చిలుకూరు బాలజీ ప్రధాానార్చకులు రంగరాజన్ పై విచక్షణారహిత దాడి..

రంగరాజన్‌కు అంతర్గతంగా గాయాలు కావడంతో ట్రీట్‌మెంట్ కోసం సిటీలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీర రాఘవ రెడ్డికి ‘సొసైటీ ఆఫ్ రామరాజ్యం’తో సంబంధం ఉందన్నారు.

శుక్రవారం ఉదయం 20 మందితో కలిసి ఆలయ సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి చేరుకున్నాడు. రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో రంగరాజన్ కుమారుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, అతనిపై కూడా దాడి చేశారు.

మరోవైపు దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం రంగరాజన్ ఇంటికి వచ్చింది వీర రాఘవరెడ్డి బృందం వచ్చింది. చిలుకూరుకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వారిలో కొంతమందిని తన సైన్యంలో చేర్చాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. తాను అలా ఎందుకు చేస్తానంటూ రాఘవరెడ్డిని ప్రశ్నించాడు రంగరాజన్.

రామరాజ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి తనకు సైన్యాన్ని తయారు చేస్తున్నానంటూ రంగరాజన్‌కు చెప్పాడు. తాను చెప్పినట్టుగా మీరు వినాలంటూ బెదిరించాడు వీర రాఘవరెడ్డి. నువ్వు తన మాట వినవా అంటూ రంగరాజన్‌పై ఆవేశంతో దాడికి పాల్పడ్డాడు వీర రాఘవరెడ్డి. మొదట దాడి చేసి తరువాత బెదిరించే వీడియోలను రికార్డ్ చేశాడు. మరోవైపు వీర రాఘవరెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×