BigTV English

Keerthi Suresh: కొత్త అవతారం ఎత్తిన మహానటి.. అదుర్స్ కదా..!

Keerthi Suresh: కొత్త అవతారం ఎత్తిన మహానటి.. అదుర్స్ కదా..!

Keerthi Suresh.. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ (Keerthi Suresh)నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో మహానటి సినిమాలో నటించి ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చాలామంది టాలీవుడ్ హీరోల సరసన నటించిన కీర్తి సురేష్ తాజాగా కొత్త అవతారం ఎత్తి అందరిని ఆకట్టుకుంది. తాజాగా కీర్తి సురేష్ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో F1 రేసింగ్ చేసింది. అయితే ఇది అబూదాబి సిటీ ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


రేసర్ గా మారిన కీర్తి సురేష్..

ముఖ్యంగా ఈ వీడియోలో కీర్తి సురేష్ యునైటెడ్ అరబ్ ఎమినేట్స్ రాజధాని అయిన అబుదాబి గురించి ప్రమోట్ చేస్తూ రేసింగ్ చేసింది మహానటి కీర్తి సురేష్. లగ్జరీగా ఎంజాయ్ చేయాలనుకుంటే అబుదాబి కి వెళ్లొచ్చు అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే ఇందులో కీర్తి సురేష్ రేసింగ్ చేయడంతో ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారింది. అంతేకాదు అబుదాబి అందాలతో వీడియోని నింపేసింది. లగ్జరీగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అంటూ కామెంట్ చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.


కీర్తి సురేష్ కెరియర్..

కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలానే సినిమాలు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా 2000 సంవత్సరంలో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత వెండితెరపై తిరిగి వచ్చి హీరోయిన్గా అవతారమెత్తి చాలా చిత్రాలలో హీరోయిన్ నటించింది. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఒక్క సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు..

ఇకపోతే సాంప్రదాయానికి పెట్టింది పేరు కీర్తి సురేష్. గ్లామర్ ప్రపంచంలో అందాలు వలకబోయకుండా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. కానీ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో తొలిసారి అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. మొన్నటి వరకు ఇండస్ట్రీకి మరో సావిత్రి దొరికింది అంటూ వార్తలు రాగా ఆ తర్వాత ఈమె కూడా గ్లామర్ షో మొదలుపెట్టేసి, ఆ పేరును కాస్త పోగొట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అందాలు వలకబోస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే నాని సరసన దసరా సినిమాలో నటించి మాస్ క్యారెక్టర్ లో కూడా ఆకట్టుకున్న ఈమె పాత్ర ఏదైనా సరే మెప్పించగలదు. అందుకే కీర్తిస్థాయికి ఇప్పుడు జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×