Keerthy Suresh : మలయాళి ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నార్త్ లో మొదటి సినిమా చేస్తుంది. బేబీ జాన్ రిలీజ్‌కి సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చాలా రోజుల నుంచి సౌత్‌లో నటిస్తున్న కీర్తి సురేశ్.. బేబీ నాన్ మూవీలో అందాల్ని ఆరబోసింది. ఈ మూవీకి రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే తీసుకుంటుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. తమిళ సూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్. ఈ చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించగా.. అతను కీర్తి సురేష్‌కి క్లోజ్ ఫ్రెండ్. దాంతో బాలీవుడ్‌లో ఈ భామకి తొలి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఈ మూవీకి ఈ బ్యూటీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం..
కీర్తి సురేష్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే పెంచింది. బాలీవుడ్ లో అందాల ఆరాబోతపై రెమ్యూనరేషన్ ఉంటుంది. దాంతో ఇక్కడ డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకూ తమిళ్, తెలుగు సినిమాల్లో నటించేందుకు కీర్తి సురేశ్ రూ.3 కోట్లు వరకూ తీసుకుంటుంది.. కానీ బేబీ జాన్ కోసం రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం.. ఇకపోతే మరో మూవీ తేరి లో విజయ్ పాత్రలో వరుణ్ ధావన్, సమంత పాత్రలో కీర్తి సురేష్, అమీ జాక్సన్ పాత్రలో వామికా గబ్బి నటిస్తున్నారు. వాస్తవానికి తేరిలో సమంత పాత్ర చాలా పద్దతిగా ఉంటుంది. రొమాంటిక్ సాంగ్ కూడా ఒకటి ఉంది. బేబీ జాన్ నుంచి రిలీజైన ఒక సాంగ్ వైరల్ అవగా.. అందులో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్‌తో పోటీపడి డ్యాన్స్ చేశారు. కీర్తి సురేష్ డ్యాన్స్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక కీర్తి సురేష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తాటిల్‌ను వివాహం చేసుకుంది. గోవాలో తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతి ప్రకారం కూడా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తంతు ముగిసిన రోజుల వ్యవధిలోనే ముంబైలో జరిగిన బేబీ జాన్ ప్రమోషన్ కార్యక్రమానికి ఈమె హాజరైంది. మెడలో పసుపు తాడుతో హాజరవ్వడంతో అందరు ఆమెను చూసి షాక్ అవుతున్నారు. రీసెంట్ గా రఘు తాత అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.. ఆ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ మంచి ఆదరణను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రివాల్వర్ రీటా, కన్నివేది తదితర చిత్రాల్లో కీర్తి సురేశ్ నటిస్తోంది. అలానే బాలీవుడ్ అరంగేట్రం, తన బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లితో ఈ ఏడాది కీర్తి సురేశ్ ఫుల్ జోష్‌లో ఉందని తెలుస్తుంది. మరి బాలీవుడ్ మూవీస్ ఏ మాత్రం సక్సెస్ ను అందిస్తాయో చూడాలి..