Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh) ‘మహానటి’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈమె అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అక్కడ ‘బేబీ జాన్’ అనే సినిమా చేసి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అయినా సరే కీర్తి సురేష్ గ్లామర్ వొలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఈమెకు వరసగా అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉందని, సినీ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఒకవైపు కెరియర్ ను కొనసాగిస్తూనే మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది కీర్తి సురేష్. అందులో భాగంగానే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ తో గత ఏడాది డిసెంబర్లో ఏడడుగులు వేసింది.
గోవా పార్టీలో కీర్తి సురేష్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతంటే..?
దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆయనతో ఈమెకు దాదాపు 15 సంవత్సరాల క్రితమే పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత తాను నటించిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారిన కీర్తి సురేష్ ఎక్కువగా తన స్నేహితులతో కలసి సందడి చేయలేక పోయింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి గోవాలో పార్టీ చేసుకుంది కీర్తి సురేష్. ఇక ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అమ్మడి డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్తతో కలిసి ఇచ్చిన పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన కీర్తి సురేష్.. ఆ పార్టీ లో ఈమె ధరించిన డ్రెస్ ధర సుమారుగా రూ.2.50 లక్షలు అని సమాచారం. ఇక ఈ ధర చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రెస్ ను రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా డిజైన్ చేసినట్లు సమాచారం.
కీర్తి సురేష్ కెరియర్, ఆస్తులు..
కీర్తి సురేష్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు పలు యాడ్స్ చేస్తూ కూడా భారీగా సంపాదిస్తోంది. ఇక అందులో భాగంగానే తన సినిమాల ద్వారా భారీగానే సంపాదించింది. అటు ఈమె భర్త అంటోనీ తట్టిల్ వ్యాపారవేత్త కావడంతో ఆయన కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. అలా మొత్తానికైతే ఇద్దరి ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్ల పై మాటే అని సమాచారం.. ఇక పెళ్లయిన తర్వాత గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డైరెక్టర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈమెకు వరుసగా అవకాశాలు తలుపు తడతాయో లేదో చూడాలి.