Kerala Crime: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ బాసినైన 23 ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడు, అమమ్మ, బంధువులు.. చివరికి ప్రియురాలిని కూడా దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత విషయం తాగి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.
అఫన్ అనే యువకుడు గంట వ్యవధిలో ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. అతడి తల్లి మాత్రం గాయాలతో బయటపడింది. సోమవారం సాయంత్రం మూడు వేర్వేరు ప్రాంతాల్లో హత్యలు జరిగాయి. అనంతరం నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించడంతో పోలీసులు నివ్వెరపోయారు. మూడు ఇళ్లలో ఆరుగుర్ని నరికినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆరుగురు బాధితులు రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అఫాన్ తల్లి తప్ప, మిగతా వారంతా అధికారులు వచ్చేలోపే గాయాలతో మరణించారు. కొంతమంది బాధితుల తలలపై తీవ్రంగా గాయాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా డ్రగ్స్ మత్తులో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా అఫాన్ అనే యువకుడు డ్రగ్స్ బానిసైనట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి 13 ఏళ్ల సోదరుడు అహసన్, అమ్మమ్మ సల్మా బీవి, మామ లతీఫ్, అత్త షాహిహా,అతని ప్రియురాలు ఫర్షానా మరణాలను పోలీసులు నిర్ధారించారు.అఫాన్ తల్లి షెఫీ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read: ముక్కోణపు ప్రేమ కథ ట్రాజెడీ.. ప్రియుడి కోసం విషం తాగిన ఇద్దరు యువకులు
అనంతరం తాను విషం సేవించినట్టు నిందితుడు పోలీసులకు తెలపడంతో చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. తన తండ్రితో విదేశాలలో నివసిస్తున్న నిందితుడు ఇటీవల విజిటింగ్ వీసాపై తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. హత్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు ఇంకా నిర్థారించలేదు. సీరియల్ కిల్లింగ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సీరియల్ కిల్లింగ్ ఘటనతో తిరువనంతపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.