Gundeninda GudiGantalu Today episode February 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. పూల కొట్టు పెట్టినందుకు మీనా ఫుల్ ఖుషి అవుతుంది. నిన్నటివరకు నేను వంటగదిగే పరిమితం అనుకున్నాను. కానీ ఇలా ఒక పూల కొట్టుకి ఓనర్ అవుతానని నేను అస్సలు ఊహించలేదు అని మీనా బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇంటికి కొత్తగా వచ్చిన శృతి నీకు పనికి డబ్బులు కట్టిందని మాకు అల్లుడుగారు అంతా చెప్పారు అమ్మ అని పార్వతి అంటుంది. దానికే నీ చేత పూల కొట్టు పెట్టించారని మాకు చెప్పాడు. ఇక సుమతి కూడా ఆ శృతి ఎక్కువ చేస్తుంది అక్క నేను ఒకసారి మాట్లాడమంటావా అని అంటుంది. అప్పుడే బాలు టిఫిన్ తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు కానీ మీ నాకు మాత్రం స్పెషల్ గా మసాలా పూరి తీసుకొచ్చి ఇస్తాడు. అందరి కోసం అన్నీ చేస్తావు నీకోసం నేను ఏది తీసుకురాలేదు ఇది తీసుకో అనేసి ఇవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ మురిసిపోతారు. నీ బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలని అందరూ ఆశీర్వదిస్తారు. మేము ఇలాగే మంచిగా అన్ని ఏరియాల్లో బిజినెస్ చేయాలని అనుకుంటున్నాం అని బాలు అనగానే చాలా సంతోషం బాబు అని పార్వతి అంటుంది.. బాలు మీనా లాభాలు రావడంతో సంతోషంలో మునిగిపోతారు. ఇక ఎలా లాభలను తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రభావతి కుళ్ళుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు మీనా ఉదయం పూల కోసమని బయటకు వెళ్తారు. ఇద్దరు మాట్లాడుకుంటూ పూలు కొనడానికి వెళ్తారు. దారిలోనే బాలు పూలకొట్టు పెట్టడానికి కారణాన్ని తెలియజేస్తాడు. డబ్బుడమ్మ శృతి, పార్లరమ్మ రోహిణిలాగే నువ్వు కూడా ఉపాధి కలిగి ఉండాలనే పూలకొట్టు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఎప్పుడూ పూలనే కాకుండా… పక్కనే ఉండే ముళ్లను కూడా చూడాలని అన్నారు. తల్లి ప్రభావతితో మీనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే.. పూటకొట్టును వృద్ధిలో తీసుకొచ్చే పనులపై మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు ప్రేమ వర్షం కురిపించుకుంటారు. మీనా, బాలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంలో మునిగి తేలుతారు.. ఈ పూల కొట్టుతో ఇంకా బిజినెస్ ని డెవలప్ చేయాలని నేను అంటుంది. అంతేకాదు మనం దీంతో పాటు ఇంకొక కారు కొంటే బాగుంటుంది అని మీనా అనగానే బాలు నేను ఇంకొక కారు కొనాలని ఇంకా ఏదో చేయాలని నీకు చేత పూల కొట్టు పెట్టించలేదు కేవలం శృతి నీకు డబ్బులు ఇచ్చి అవమానించింది అని మాత్రమే పూల కొట్టు పెట్టించాను నువ్వేం కష్టపడి అంత సంపాదించాల్సిన అవసరం లేదని బాలు అంటాడు. మనం సంపాదించి నలుగురిలో తలెత్తుకొని ఇలా చేయాలని మీరు నా చేత ఇది పెట్టించారు నేను కూడా అలానే కష్టపడి సంపాదిస్తాను అని నేను అంటుంది.. మొత్తానికి మీనా పూలుకొని తీసుకొని వస్తారు.
ప్రభావతి లేవగానే మీనా మీనా అని అరుస్తుంది కానీ సత్యం మాత్రం మీనా లేదు పూలు కొనడానికి బయటకు వెళ్లిందని అంటాడు. ఇప్పుడు కాఫీ ఎవరు పెడతారు అని ప్రభావతి అంటుంది. నువ్వే పెట్టుకో మీనా లేకుండా ఉంటే నీకు వంట చేయడం రాదా ఏంటి అని ఎద్దేవా చేస్తాడు. పెళ్లయిన తర్వాత వంట చేసింది నేనే ఆ విషయం మీరు మర్చిపోతున్నారు అని ప్రభావతి కూడా ఉంటుంది అయితే వెళ్లి కాఫీ పెట్టుకో మానేసి సత్యం అంటాడు. కానీ ప్రభావతి మాత్రం మీనా వచ్చిన తర్వాత కాఫీ పొడి ఎక్కడుందో ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను ఇప్పుడేం చేయాలంటే వెళ్లి ఇంట్లోకి వెళ్లి వెతికి కాఫీ పెడితే పెట్టు లేదంటే నేను బయటికి వెళ్లి కాఫీ తాగుతాను అని సత్యం అంటాడు. అప్పుడే ఇంట్లోని వాళ్ళందరూ వచ్చి మీనా కాఫీ అంటూ అరుస్తారు..
మీనా ఇంట్లోనే ఉందనుకొని ప్రభావతి, మనోజ్ – రోహిణి, రవి – శృతిలు కాఫీ ఇవ్వమని అడుగుతుంటారు. కానీ సత్యం వచ్చి మీనా ఇప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉంటుంది.. ఎవ్వరి పనులు వారే చేసుకోవాలని చెప్తాడు. మీనా బిజీగా ఉంటుందని పూలు తెచ్చుకోవడానికి రోజూ వెళ్తుంటారని.. ఇకపై పనులన్నీ నువ్వే చేయాలని ప్రభావతికి గట్టిగా చెప్తాడు సత్యం. ఇక ప్రభావతి కిచెన్ లో కనీసం కాఫీ కూడా పెట్టుకోలేని స్థితిలో మీనా చిరాకు పడుతుంది. అన్నీ పనులు తనే చేసుకోవాల్సి వస్తుందే అని విసిగిపోతుంది. ప్రతిరోజూ మీనా పనిచేసి ఈ ఒక్కరోజు ఇంట్లో పనులు చేయకపోవడంతో అందరూ తమ తమ పనులకు వెళ్లిపోతారు.. బాలు ఇంట్లో అందరికీ టిఫిన్ తీసుకొని వస్తాడు. టిఫిన్ చేయడం రాదని ఊహించే టిఫిన్ తెచ్చానని అంటాడు. ఆకలితో ఉన్న ప్రభావతి బాలు తెచ్చిన టిఫిన్ చూసి అరుస్తుంది చిరాకు పడుతుంది నువ్వు చేసేదేం బాగాలేదని బాలుపై చిందులేస్తుంది.
దాంతో బాలు కాస్తా ఎటకారంగా మాట్లాడుతూనే తన భార్యకు ఎవ్వరూ పనులు చెప్పకూడదని తెగేసి చెప్తాడు. ఇంట్లో పనులు చేయడానికి మీనాకు ఏమాత్రం సమయం ఉండదని, అందుకు వంట చేసేందుకు, పూలకొట్టులో మీనాకు సాయంగా ఉండేందుకు పని మనిషిని పెట్టబోతున్నట్టు తల్లి ప్రభావతికి చెప్తాడు. అప్పటి వరకు ఇంట్లో పనిమనిషిలా అన్నీ పనులుచేసిన మీనా పూలకొట్టుకు ఓనర్ అయ్యి.. ఇప్పుడు ఆమె పనులు ఆమెనే చేసుకుంటుండటంతో ప్రభావతికి ఇంకా కడుపు మండుతుంది.. తన అసూయను వెళ్లగక్కుతుంది. బాలు నివారించి మీనా పూలకొట్టు మాత్రమే చూసుకోవాలని తెగేసి చెప్తాడు. కట్ చేస్తే… అర్థరాత్రి పూట సత్యం ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు. అందరూ పడుకున్న సమయంలో తలుపులు బాదుతుంటారు. ఎవ్వరూ లేవకపోవడంతో ప్రభావతినే లేచి డోర్ తీస్తుంది. బయట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారు. వాళ్లు ఎవరి ఆరా తీస్తుంది ప్రభావతి. అయితే వాళ్లు వచ్చింది పెళ్లికి పూలదండల కోసమని ప్రభావతికి చెప్తుంటారు.. ఇక ప్రభావతి చిరాకు పడుతుంది.. మొత్తానికి మీనా పూల కొట్టు ప్రభావతికి నిద్రలేకుండా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మనోజు పూల కొట్టు గురించి చిన్నతనంగా ఉందని అందరి ముందు చెప్తాడు. ఇంకెక్కడ పెట్టుకోవాలని బాలు గొడవకు దిగుతాడు. పూల కొట్టు గురించి పాంప్లెట్లు పంచడానికి పార్కు వద్దకు వెళ్తే అక్కడ మనోజ్ పార్కులో కనిపిస్తే ఆ ఫోటోలను తీసుకుంటాడు నీకు ఇంట్లో ఉంది ఇంకా అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎపిసోడ్ లో మనోజ్ గురించి ఇంట్లో బాంబు పేలుస్తాడేమో చూడాలి..