Keerthi Suresh : మహానటి కీర్తి సురేష్ పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. మొన్నటివరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోబోతుందని రోజుకో వార్త వినిపిస్తుంది. డిసెంబర్ లో ఈమె పెద్దలు ఫిక్స్ చేసిన వ్యక్తితోనే ఏడు అడుగులు వెయ్యబోతున్నారు. అయితే ఈమె ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలను మాత్రమే పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారా? లేదా అన్నది తెలియలేదు. అయితే కీర్తి సురేష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ హీరోతో అలాంటి పని చెయ్యనని సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
కీర్తి సురేష్ బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చిన్నప్పుడే తన నటనతో మెప్పించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను బయట పెట్టింది. కీర్తికి సినిమాలంటే ఆసక్తి లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఆ కోర్సులో డిగ్రీ చేసి, లండన్‌లో రెండు నెలలు శిక్షణ కూడా తీసుకున్నారు. కీర్తికి వయోలిన్ వాయించడం కూడా వచ్చు. చిన్నప్పటి నుంచి సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ప్రాక్టీస్ చేయడానికి సమయం దొరకడం లేదు.. ఈమె హీరోయిన్ గా మాత్రమే మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే.. ఈమె ఇదు ఎన్న మాయమ్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి, రజినీ మురుగన్, రెమో, బైరవా వంటి సినిమాల్లో నటించారు. నాగ్ అశ్విన్ మహానటి సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన హిట్ టాక్ ను అందుకోలేదు. కెరీర్‌లో విజయాలు, అపజయాలు రెండూ చూశారు. నాని దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ మామన్నన్‌లో నటనకు ప్రశంసలు అందుకున్నారు.. ఇదిలా ఉండగా.. ఈమె సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయిన నటించాలని అనుకుంటారు. కానీ ఓ హీరో తో గొడవలు ఉన్నాయి వార్తలు ఒకప్పుడు వినిపించాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ హీరో నితిన్.. 2021లో, లిప్‌లాక్ సన్నివేశం కారణంగా నితిన్ నటించిన తెలుగు చిత్రం మాస్ట్రోను తిరస్కరించారు. కేవలం లిప్ లాక్ వల్లే రిజెక్ట్ చేసిందట. కానీ వీరిద్దరి మధ్య గొడవలు అంటూ వార్తలు వినిపించాయి. ఇక కేరీర్ విషయానికొస్తే.. కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం రఘు తథా మిశ్రమ స్పందనను అందుకుంది. వరుణ్ ధావన్‌తో బావాల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. రివాల్వర్ రీటా, కన్నెవెడి సినిమాలు కూడా చేస్తున్నారు. గత ఏడాది సంగీత దర్శకుడు అనిరుధ్‌తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి, దాన్ని ఆమె తండ్రి ఖండించారు. తాజాగా ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అంటోనీ ను పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో వీరిద్దరి పెళ్లి జరగబోతుందని సమాచారం.. త్వరలోనే ఆఫీషియల్ ప్రకటన రానుంది..