Kishan Reddy: జార్ఖండ్ లో తాము అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయినా తమ పాత్ర తాము పోశించామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో సీట్లుగానీ ఓట్లు గానీ అంతే వచ్చాయని చెప్పారు. కానీ మహరాష్ట్రాలో తమ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. జార్ఖండ్ లో గతంలోనూ తమకు అన్ని సీట్లే వచ్చాయని చెప్పారు. మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… గ్యారెంటీలతో మభ్యపెట్టి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో గెలిచారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ కలిసి కాంగ్రెస్ కు 30 సీట్లు వచ్చేలా లేవని విమర్శించారు.
Also read: వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయం.. భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్
మహరాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ పై నమ్మకం ఉంచరాని అన్నారు. రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజల నాడిని కాంగ్రెస్ పసిగట్టలేక దేశం ముందు మరోసారి నవ్వులపాలు అయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కులం, మతం పేరుతో రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మహరాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఒరిజినల్ శివసేన కాదని మండిపడ్డారు. అసలైన శివసేన షిండే చేతిలోకి వెళ్లిందని ఆరోపించారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన రాహుల్ గాంధీతో కలిసి బాల్ థాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిందని అన్నారు. బాల్ థాక్రేకు మద్దతు ఇచ్చేవారంతే షిండే శివసేనకు ఓటు వేశారని చెప్పారు. బాల్ థాక్రే కొడుకును కూడా లెక్కచేయకుండా ప్రజలు ఓడించారని చెప్పారు. అసలైన శివసేన బీజేపీతోనే ఉందని అన్నారు. శివసేన లక్ష్యాలకు ఉద్ధవ్ థాక్రే వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయనను ఓడించి బీజేపీకి అండగా నిలబడ్డారని అన్నారు. యూపీలో సమాజ్ వాద్ పార్టీకి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.