Keerthy Suresh Wedding: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రముఖ మలయాళ హీరోయిన్ మేనక (Menaka) వారుసురాలిగా అడుగుపెట్టింది కీర్తి సురేష్ (Keerthi Suresh). చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పలు చిత్రాలలో నటించింది. చిరంజీవి(Chiranjeevi), సిమ్రాన్(Simran) కలయికలో వచ్చిన ‘డాడీ’ సినిమాలో కూడా చిరంజీవి కూతురు పాత్రలో కీర్తి సురేష్ ని స్క్రీన్ టెస్ట్ చేసి కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కానీ డైరెక్టర్ అనుకున్నంత స్థాయిలో సన్నివేశాలు రాలేదని, ఈమెను తప్పించి ఇంకో అమ్మాయిని తీసుకోవడం జరిగింది. ఇక ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది కీర్తి సురేష్.
మహానటి సినిమాతో నేషనల్ అవార్డు..
ఇటీవల ప్రభాస్(Prabhas)తో ‘కల్కి2898AD’ సినిమా చేసి, పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు నాగ్ అశ్విన్(Nag Ashwin). ఇక ఈయన దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రం ‘మహానటి’. దివంగత నటీమణి సావిత్రి (Savitri) జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా కీర్తి సురేష్ కు మంచి గుర్తింపును అందించింది. ఇందులో కీర్తి సురేష్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఈమె నటనను మెచ్చి ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందించారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులు క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) తో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆమె కొట్టిపారేసింది.
ప్రేమ విషయం కన్ఫామ్ చేస్తూ పోస్ట్..
అయితే ఇప్పుడు సడన్ గా తన చిన్ననాటి స్నేహితుడితో పెళ్లికి సిద్ధమైంది అంటూ వార్తలు రాగా.. దీనిపై స్పందించని కీర్తి సురేష్ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చింది. ” గత 15 సంవత్సరాలుగా ఆంటోనీని నేను ప్రేమిస్తున్నాను. ఇక ఇప్పుడు పెద్దల సహకారంతో పెళ్లి చేసుకుంటున్నాం. AntoNY x KEerthy (lykyk)” అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన బ్యాక్ ఫోటో ని కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఎట్టకేలకు రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది కీర్తి సురేష్.
దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్త..
కీర్తి సురేష్ కాబోయే భర్త ఆంటోనీ దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సొంతం చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తండ్రి ప్రముఖ నిర్మాత జి.సురేష్ (G.Suresh)వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే తమ ప్రేమను కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కానీ వివాహం ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండగా.. పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కీర్తి సురేష్ కెరియర్..
కీర్తి సురేష్ విషయానికి వస్తే.. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో గ్లామర్ డాల్ గా తొలిసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందాలు ప్రదర్శిస్తూ.. నెటిజన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కీర్తి సురేష్. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తోంది.