BigTV English

KGF 3: రాకీ భాయ్‌గా మ‌రో హీరో.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

KGF 3: రాకీ భాయ్‌గా మ‌రో హీరో.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

KGF 3:ఈ మ‌ధ్య కాలంలో పాన్ ఇండియా లెవ‌ల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సౌత్ ఇండియ‌న్ మూవీస్‌లో KGF ఒక‌టి. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. ఈ రెండు పార్టులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధించాయి. ముఖ్యంగా KGF 2 గ‌త ఏడాది రూ.1200 కోట్ల‌ను సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో KGF 3పై వ‌స్తే బావుంటుంద‌ని ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మేక‌ర్స్ కూడా KGF 3 ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు కానీ.. ఎప్పుడ‌నేది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ఆ మ‌ధ్య అన్నారు. అయితే రీసెంట్‌గా హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ KGF 3కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.


ఆయ‌న KGF 3కి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూనే.. మరో షాకింగ్ విష‌యం కూడా చెప్పాడు. అదేంటో తెలుసా! KGF 3లో యష్ హీరోగా ఉండ‌ర‌ని. సాధార‌ణంగా జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోలు మారుతుంటారు. అదే స్టైల్లో KGF సిరీస్‌లోనూ వేర్వేరు హీరోలు న‌టిస్తార‌ట‌. KGF సిరీస్‌లో ఐదు భాగాలుంటాయ‌ని, అందులో ఇప్ప‌టికే రెండు భాగాలు వ‌చ్చాయ‌ని, మిగ‌తా మూడు భాగాల‌ను రూపొందిస్తామ‌ని విజ‌య్ కిర‌గందూర్ తెలిపారు. KGF 3 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా స్టార్ట్ కాలేద‌ని, 2025లోపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి 2025లో షూటింగ్‌ను షురూ చేసి 2026 లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

అయితే రాకీ భాయ్ అంటే య‌ష్ అనే ఓ బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. మ‌రిప్పుడు ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేయ‌గ‌ల హీరో దొరుకుతాడా? ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×