BigTV English

Khushboo Sundar: మా నాన్నే నన్ను వేధిస్తే.. అడిగే దిక్కు లేదు: ఖుష్బూ

Khushboo Sundar: మా నాన్నే నన్ను వేధిస్తే.. అడిగే దిక్కు లేదు: ఖుష్బూ

Khushboo Sundar Opens Up On Being physical assault Abused By Father: మళయాల చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ ఒక అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడిది ఒక మాలీవుడ్ నే కాదు.. యావద్భారతీయ చిత్ర పరిశ్రమనే కుదిపేస్తోంది.


ఈ నేపథ్యంలో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ స్పందించింది.  ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే మన చిత్రపరిశ్రమలో ముఖ్యంగా మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమని అన్నారు. ఈ విషయంలో మహిళలు చాలామంది బయటకి వచ్చి చెప్పడం గొప్ప విషయమని అన్నారు.

2017లో నటుడు దిలీప్ ప్రోద్బలంతో ఒక నటి లైంగిక వేధింపులకు గురికావడంతో కేరళ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. హేమ నేతృత్వం వహించారు. మరో ఇద్దరు.. నటి శారద, ఇంకా కేరళ ప్రభుత్వ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేబీ వల్సలకుమారి సభ్యులుగా ఉన్నారు.


వీరందరూ కలిసి మాలీవుడ్ లో ప్రసిద్ధ నటీమణుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు సుమారు 80 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వారిచ్చిన సాక్ష్యాలను రికార్డ్ చేశారు. అలా అధ్యయనం చేసి 296 పేజీల నివేదికను తయారుచేశారు.

ఎన్నో చట్టపరమైన అంశాలను పరిశీలించి ఇటీవల దానిని విడుదల చేశారు. ఈ రిపోర్టు ఇప్పుడు ఒక్క మాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రష్టిస్తోంది. ఈ దెబ్బకు మాలీవుడ్ సినీ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అసోసియేషన్ ని రద్దు చేసి పారేశారు.

Also Read: ఖుషీ 2 కథ పవన్ కు చెప్పాను.. ఆయన ఏమన్నారంటే.. ?

ఈ సమయంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ అన్నమాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా  ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి హేమ కమిటీ నిజాలను నిర్భయంగా బయటపెట్టిందని అన్నారు. దురద్రష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రతీ రంగంలో కూడా వేధింపులకు గురయ్యేది మహిళలేనని అన్నారు. ఈ సమమంలో బాధితులకు మన సపోర్ట్ ఎంతో అవసరమని అన్నారు.

ఎందుకంటే నేను ఒక బాధితురాలినే. అప్పుడు నా వయసు 14ఏళ్లు. ఆ సమయంలో మా నాన్న వేధింపులు తాళలేకపోయేదాన్ని. నా వయసు చాలా చిన్నది. ఎలా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎంతో మానసిక వ్యధ అనుభవించానని చెప్పారు. మా నాన్నే నన్ను వేధిస్తే అడిగే దిక్కులేని సమాజంలో బతుకుతున్నామని అనిపించిందని అన్నారు.

ఇప్పటికి నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకారోజు చెప్పలేదని..? ఇప్పుడు ఎంతో అవేర్ నెస్ వచ్చింది. అందుబాటులో సామాజిక మాధ్యమాలున్నాయని అన్నారు. వీటన్నింటిని ఉపయోగించుకొని, ఏరోజు కష్టం వచ్చిందో ఆరోజే చెబితే విషయ తీవ్రత ఉంటుందని అన్నారు. హేమ కమిటీపై రగులుతున్న వివాదానికి ఖుష్బూ మాటలు.. మండే కట్టెలపై పెట్రోల్ పోసినట్టయ్యిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×