Khushi Kapoor : జాన్వి కపూర్ సోదరి ఖుషి కపూర్ (Khushi Kapoor) ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్లాస్టిక్ సర్జరీ కామెంట్స్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు తాజాగా నెగిటివిటీ, ఇంటర్నెట్లో 10 సెకండ్ల వీడియోలు చూసి, వాళ్ల గురించి జడ్జ్ చేసే కల్చర్ గురించి మాట్లాడారు. మరి ఆమె ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసింది? ఎవరిని ఉద్దేశించి చేసింది? అనే వివరాల్లోకి వెళితే…
చేయని తప్పు నుంచి కాపాడుకోవాలి
ఖుషి కపూర్ (Khushi Kapoor) ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ మూవీ ‘లవ్ యాపా’ (Loveyapa) లో కనిపించబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలపై ఖుషి కపూర్, జునైద్ ఖాన్ ఇద్దరూ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఏఐను ఉపయోగించి పలు వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారని, ఇలా ఏఐని మిస్ యూజ్ చేసే వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పింది ఖుషి కపూర్. “ఏఐ వల్ల చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అసలు చేయని పనుల నుంచి కూడా జనాలు తమను తాము రక్షించుకోవలసి ఉంటుంది. అయితే మనం ఇంటర్నెట్లో ఏం పెడుతున్నాము? సాధారణంగా ఇంటర్నెట్ ను ఎలా మేనేజ్ చేస్తున్నాము ? అనే విషయంలో జాగ్రత్తగా ఉంటే సురక్షితంగా ఉన్నట్టే అని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
10 సెకండ్ల వీడియో చూసి జడ్జ్ చేస్తారు
ఇక ఇంస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ల గురించి ఖుషి (Khushi Kapoor) మాట్లాడుతూ “10 సెకండ్ల రీల్ చూసి ఎవరినీ జడ్జ్ చేయొద్దు. అసలు వాళ్ల గురించి ఏం తెలుసు?” అంటూ ప్రశ్నించింది. ఖుషి ఈ విషయం గురించి మాట్లాడుతూ “కేవలం 10 సెకండ్ల ఇంస్టాగ్రామ్ రీల్ చూసి జనాలు ఒక వ్యక్తి గురించి నానా రకాలుగా అనుకుంటారు. కానీ 10 సెకండ్ల క్లిప్పు ద్వారా ఆ వ్యక్తి గురించి మీరు ఏం అర్థం చేసుకోగలరు? వాళ్ల జీవితం గురించి లేదంటే వాళ్ల గురించి ఏం తెలుస్తుంది? అలా వీడియోలను చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది ఖుషి కపూర్.
మరోవైపు జునైద్ (Junaid Khan) ఈ విషయం గురించి స్పందిస్తూ “ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలి. ఫోన్లో కంటే నిజ జీవితంలో కమ్యూనికేషన్ ముఖ్యం. ముఖ్యంగా మీ పార్ట్నర్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. ఓపెన్ గా కమ్యూనికేట్ అవ్వడం చాలా ముఖ్యం” అని అన్నారు. ఇక బుధవారం ముంబైలో ‘లవ్ యాపా’ సినిమా ప్రీమియర్లు వేయగా, దీనికి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, జాన్వి కపూర్ వంటి స్టార్స్ హాజరయ్యి, మూవీపై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ కు ఇదే ఫస్ట్ మూవీ.