Payal Rajput.. పాయల్ రాజ్ పుత్ (Payal Rajput).. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో చాలా గ్లామర్ గా నటించి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కాలంలో అదే క్రేజ్ తో పలు చిత్రాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక తర్వాత కొన్నాళ్లకు మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమా చేసి తన నటనతో ప్రేక్షకులను ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మంగళవారం సినిమాలో పాయల్ చేసిన పాత్రకు, నటించిన తీరుకి విమర్శకులు కూడా ప్రశంసలు గుప్పించారు. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న పాయల్ ఖచ్చితంగా ఈ సీక్వెల్ లో కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజ్ పుత్ సీక్వెల్ లో ఉండడం లేదని తెలుస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి మరో హీరోయిన్ ని రంగంలోకి దింపబోతున్నట్లు చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఇలాంటి సమయంలో పాయల్ చేసిన ట్వీట్ తో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దర్శకుడికి శుభాకాంక్షలు..ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా..
పాయల్ చేసిన ట్వీట్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. ఆమె తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా.. “నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ అజయ్ భూపతి కి శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వంలో నటించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కచ్చితంగా మరో మంచి మాస్టర్ పీస్ సినిమా ఆయన నుండి రాబోతోంది. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అజయ్ భూపతి సక్సెస్ లెగస్సీ ఇలాగే కంటిన్యూ కావాలంటూ తెలిపింది పాయల్ రాజ్ పుత్. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పాయల్ ఇందులో నటిస్తోందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అతి త్వరలోనే మంగళవారం సీక్వెల్ రాబోతోందని, అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటుల ఎవరు? అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
సందేహాలు వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..
ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా పాయల్ రాజ్ పుత్ఈ సినిమాలో నటించడం లేదని, శ్రీలీలను ఎంపిక చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో సడన్గా పాయల్ ఇలా ట్వీట్ చేయడంతో అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ నటిస్తోందా? లేదా? ఒకవేళ నటించకపోతే ఆమె ఎందుకు ఇలాంటి ట్వీట్ పెట్టింది.. ఒకవేళ ఆమె నటిస్తున్నది నిజమే అయితే మళ్లీ మూడోసారి వేరే కాంబినేషన్లో సినిమా బ్లాక్ బాస్టర్ అయినట్టే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో సందేహాలను సృష్టించేలా పాయల్ చేసిన ట్వీట్ ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.
As a huge fan of director Ajay Bhupathi, I’m thrilled to witness another Master piece 🎥
The legacy must continue !
Best wishes 🌸— paayal rajput (@starlingpayal) February 6, 2025