Game Changer:ఒకప్పుడు మెగా పవర్ స్టార్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ (Ram Charan)తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar) దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇందులో కియారా అద్వానీ (Kiara advani)హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా చూసి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తన మొదటి రివ్యూ ఇచ్చేశారు. ప్రథమార్థం అద్భుతంగా వచ్చింది అని ప్రశంసలు కురిపించారు. ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ అని క్లైమాక్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ కి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని తన అభిప్రాయంగా తెలిపారు సుకుమార్.
డాన్స్ రిహార్సల్ తో అదరగొట్టేసిన కియారా..
సుకుమార్ అలాంటి రివ్యూ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంతలోనే మరొకవైపు ఈ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ ప్రచారానికి కూడా తన వంతు పనిచేయడానికి బరిలోకి దిగింది. గేమ్ ఛేంజర్ మొదటి పాట కోసం తెర వెనుక ఎలా ఉంటుందో ఆవిష్కరించే ఒక డాన్స్ వీడియోని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతే కాదు ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కియారా డిస్నీ ల్యాండ్ ని తలపించే సెట్ లో 13 రోజులపాటు ఒక పాటను చిత్రీకరించడం ఇదే మొదటిసారి అంటూ వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్స్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని ఆమె షేర్ చేస్తూ ఇలా రాసుకుంది.” గేమ్ ఛేంజర్ మొదటి షెడ్యూల్ కోసం రిహార్సల్ లో భాగంగా మొదటి రోజు స్నీక్ పీక్ ఇది. ఎస్.శంకర్ అందంగా రూపొందించిన దోప్ పాట చిత్రీకరణతో సినిమాని మేము మొదలుపెట్టాము” అంటూ ఆమె తెలిపింది.
అత్యుత్తమ డాన్సర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు..
ముఖ్యంగా కొత్త స్టైల్ డాన్స్ ఇది. డబ్ స్టెప్, క్లాసికల్, రోబోటిక్, హిప్ హాప్ డాన్స్ లు ఇవి. నాకు తెలిసి అత్యుత్తమ డాన్సర్లలో ఒకరైన రామ్ చరణ్ తో కలిసి నేను స్టెప్పులు వేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది అంటూ రాసుకుంది కియారా అద్వానీ. ఇకపోతే ఎస్ఎస్ తమన్ ప్రత్యేక బిట్స్, మనీష్ మల్హోత్రా అద్భుతమైన కాస్ట్యూమ్స్, మెహక్ ఒబెరాయ్ అద్భుతమైన మేకప్ అందించారు అంటూ కూడా పాట అద్భుతంగా రావడం వెనుక ఉన్న వారి గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ లో ఎస్. జె.సూర్య విలన్ గా నటిస్తూ ఉండగా.. ఈ సినిమా జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇక అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి మరో పెద్ద ఈవెంట్ ను ఆంధ్రాలో కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డీసీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">