BigTV English

Kiran Abbavaram: అది నిజమని నిరూపిస్తే.. సినిమాలు మానేస్తా.. కిరణ్ ఓపెన్ ఛాలెంజ్

Kiran Abbavaram: అది నిజమని నిరూపిస్తే.. సినిమాలు మానేస్తా.. కిరణ్ ఓపెన్ ఛాలెంజ్

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం క. సందీప్ అండ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన  కిరణ్ అబ్బవరం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ ను మరింత పెంచుతున్నాడు. మొదటి ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ, ఇప్పుడు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చారు.


అయితే మిగతా భాషల్లో క సినిమాను ఎందుకు రిలీజ్ చేయడం లేదో కిరణ్  వివరణ ఇచ్చాడు. అక్టోబర్ 31 నే మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతుంది. క మూవీ మలయాళ హక్కులను దుల్కర్ నిర్మాణ సంస్థనే కొనుగోలు చేసింది. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం, అక్కడ దుల్కర్ బిగ్ స్టార్ కావడంతో.. క మూవీ మేకర్సే  మలయాళంలో దుల్కర్ తో పోటీ వద్దని చెప్పినట్లు తెలిపాడు. తమిళ్ లో తమ సినిమాకు థియేటర్స్ దొరకలేదని ఒప్పుకున్నాడు.

Chiranjeevi: కొణిదెల శివశంకర వరప్రసాద్ టూ మెగాస్టార్.. ఒక్క ఫోటోతో 50 ఏళ్లు వెనక్కి..


తెలుగులో కూడా థియేటర్స్ విషయంలో కిరణ్ కు అన్యాయమే జరిగింది. ఎక్కువ సినిమాలు ఉండడంతో.. కిరణ్ కు చాలా తక్కువ థియేటర్స్ నే  దొరికాయి. అయినా కంటెంట్ మీద ఉన్న  నమ్మకంతో అదే రోజు  సినిమాను రిలీజ్ చేయడానికి రిస్క్ తీసుకున్నామని హీరో చెప్పుకొచ్చాడు. ఇక ట్రైలర్ రిలీజ్ అయినదగ్గరనుంచి సినిమాపై హైప్ పెరిగింది. కొంతమంది క చిత్రాన్ని కాంతార సినిమాతో పోలుస్తున్నారు.

ఇక ఈ పోలికపై కిరణ్ స్పందించాడు. ఈ సినిమాకు ఎలాంటి సినిమాతో పోలిక లేదు అని చెప్పుకొచ్చాడు. ” ట్రైలర్ లో ఎక్కువ చీకటి షాట్స్ ఉండడంతో కాంతారలా అనిపిస్తుంది. ఇందులో ఎలాంటి  భక్తి సంబంధమైన  లైన్ లేదు.  ఇలాంటి  ఒక కాన్సెప్ట్ మునుపెన్నడూ  రాలేదు. మా సినిమాకు మరే సినిమాతో పోలిక లేదు.. మా సినిమా పాయింట్ ఎక్కడో చూశాం అని మీకు అనిపిస్తే నేను సినిమా మానేస్తా” అని కిరణ్ అబ్బవరం ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.

They Call Him OG: ఆ కటౌట్ కనిపించినా చాలు సార్.. పూనకాలే

” క చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వాసుదేవ్ అనే ఒక అనాథకు ఇతరుల విషయాలను తెలుసుకోవాలనే  ఆత్రుత ఉంటుంది. అందుకోసమే పోస్ట్ మ్యాన్ గా మారి.. కృష్టగిరి అనే ఊరుకు వెళ్తాడు. అక్కడకు వెళ్లిన అతనికి ఎదురైనా సమస్యలు ఏంటి.. ? అనేది క కథ. ఈ సినిమా సక్సెస్ అవుతుందా.. ? లేదా.. ? అనేది మా తెలుగు ప్రేక్షకుల చేతిలోనే ఉంది. నేను పాన్ ఇండియా హీరో అవుతాను అనేది పక్కన పెడితే.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే చాలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కిరణ్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ను ఎవరైనా అందుకొని.. నిరూపిస్తారా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే ఇంకో వారం వరకు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×