Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అందరికి తెలుసు.. రీసెంట్ గా క అనే కొత్త కథ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఆయన ట్రాక్ యూటర్న్ తీసుకుంది. సరికొత్త కథల తో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణివారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ యువ కథనాయకుడు మొదటి సినిమాలో తనతో నటించిన హీరోయిన్ తోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరు కొన్నేళ్లు రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై కొన్ని నెలలు కూడా కాలేదు అప్పుడే భార్యకు దూరం అయ్యాడని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని ప్రచారం మొదలైంది. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా క.. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ కొత్తగా ఉండటంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటుగా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి అయ్యాక తనకు అదృష్టం కలిసి వచ్చింది. మొదటి సినిమానే హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రుబా అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అది శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు విశ్వ కరుణ్ డైరెక్షన్ చేస్తుండగా రుక్సార్ తిల్లాన్ అనే కథానాయక మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని ఏ యాడ్లీ ఫిలిం, అలాగే శివం సెల్యులాయిడ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి లవర్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో తాజాగా సినిమాకి సంబంధించినటువంటి మొదటి లుక్ ను న్యూయర్ సందర్బంగా రిలీజ్ చేశారు..
ఈ మూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. జనవరి మూడో తేదీన టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే మొదటి లుక్ లో కిరణ్ అబ్బవరం బీచ్ లో సైకిల్ మీద హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చూసిన నేటిజన్స్ ఇంట్లో భార్యను వదిలేసి మరో అమ్మాయితో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్ళై కొద్ది రోజులే కదా భార్యలేకుండా వెళ్ళావా.. ఏంటి మనస్పర్థలు వచ్చాయా..? మీరు కూడా అప్పుడే విడాకులు తీసుకోబోతున్నారా అని నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని పై రహస్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే మరో రెండు సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.. త్వరలోనే ఆ మూవీస్ ను అనౌన్స్ చెయ్యనున్నారు.