BigTV English

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు… ఫస్ట్ ప్లేస్ లో క్రేజీ హార్రర్ మూవీ

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు… ఫస్ట్ ప్లేస్ లో క్రేజీ హార్రర్ మూవీ

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో హర్రర్ సినిమాల హడావిడి కొనసాగుతోంది. ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన భూళ్ భూలయ్య 3 సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా అదే జోరును కొనసాగిస్తుంది. లక్కీ భాస్కర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లో ఉండగా, ‘భూళ్ భూలయ్య 3’ మూవీ ‘లక్కీ భాస్కర్’ సినిమాని అధిగమించింది. టాప్ 10 లో మొదటి స్తానంలో ఉంది. ఈ హర్రర్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? స్టోరీ ఏమిటో వివరాల్లోకి వెళితే..


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

‘భూళ్ భూలయ్య 3’ (Bhool Bhulaiyaa 3) హర్రర్ కామెడీ మూవీ డిసెంబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గత ఏడాది హారర్ కాన్సెప్ట్ లో వచ్చిన ‘స్త్రీ 2’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ‘భూళ్ భూలయ్య 3’ కూడా అదే తరహాలో మంచి వసూళ్లను సాధించింది. ఈ హర్రర్ కామెడీ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ ట్రిప్తి డిమ్రీ నటించారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ దాదాపు 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించింది. 2024లో వచ్చిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది.


స్టోరీ లోకి వెళితే

రోహన్ దయ్యాలను వెళ్ళగొడతానని చెప్పి మోసం చేసి, డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతన్ని ఒక రాజ కుటుంబం కలుస్తుంది. ఇంట్లో తన కూతురు చనిపోయిందని, తనతో మాట్లాడాలని రోహన్తో చెప్తారు రాజ వంశస్తులు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రోహన్ ని చూసి ఫేక్ మాంత్రికుడని గ్రహిస్తారు. అయినా అతనిని ఒక రాజమహల్ కి తీసుకెళ్తారు. ఆ మహల్ లో రాజ వంశస్థులు పేదరికంగా ఉంటారు. ఆ మహల్ లో దయ్యాలు ఉన్నాయనే భయంతో, ఎవరూ ఆ మహల్ ని కొనరు. రోహన్ ఏమైనా సహాయపడతాడేమో అని తీసుకొస్తారు. ఆ మహల్ లో రోహన్ కి వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ మహల్ లోని రక్త ఘాట్లో ఒక రాజు తన సొంత కూతురిని రాణిని చేయకుండా,సవతి తల్లి కొడుకుకి అవకాశం ఇస్తాడు. ఆ కోపంలో ఆమె తమ్ముణ్ణి చంపేస్తుంది. ఆగ్రహించిన రాజు బ్రతికి ఉండగానే కూతురికి నిప్పంటించి చంపుతాడు. ఆ తరువాత ఆమె దయ్యం రూపంలో తిరుగుతుందని ప్రచారం జరుగుతూ ఉంటుంది. చివరికి రోహన్ ఆ మహల్ లో దయ్యాలను వెళ్ళగొడతాడా? ఆ దయ్యాలు సృష్టించే హడావిడి ఏమిటి? ఆ మహల్ ని అమ్మి ఆ వంశస్థులు కోటీశ్వరులు అవుతారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ కామెడీ మూవీ భూళ్ భూలయ్య 3 (Bhool Bhulaiyaa 3) మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×