E-Paper
Advertisement

Ka Movie: క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది.. ఇదుగో ఆన్సర్.. ?

Ka Movie: క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది.. ఇదుగో ఆన్సర్.. ?

Ka Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు.  ఆయన నటించిన క సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను అలరిస్తుంది. ఏడాది గ్యాప్ తీసుకొని.. మంచి కథను ఎంచుకొని, లుక్ మార్చి.. కిరణ్ చేసిన ప్రయోగం ప్రేక్షకులను మెప్పించింది. సుజిత్- సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.  ఆయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె లక్ కూడా  క కు పనికొచ్చిందని చెప్పాలి.

మొదట క  మూవీ కి థియేటర్స్ తక్కువ ఇచ్చారు. అయితే ఉన్నకొద్దీ క కు మౌత్ టాక్ పెరగడంతో థియేటర్లను పెంచారు. ఇక కిరణ్ సైతం ఈ సినిమా విజయం అందుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే.. ఉదయం నుంచి క  మూవీ ఓటీటీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?

ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ క మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.. ఆ ఓటీటీ ఏంటిదో గెస్ చేయండి అనే పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో  మీమర్స్.. క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది అనే ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు.

ఇక క మూవీ ఏ ఓటీటీలో వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. క సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో మంచి మంచి సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్న ఈటీవీ విన్.. క మూవీ డిజిటల్ హక్కులను సుమారు రూ.10కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత  ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే.. నవంబర్ మూడో వారంలోనే క.. ఓటీటీలో అడుగుపెట్టొచ్చు. ఒకవేళ లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగితే కొద్దిగా లేట్ అవ్వొచ్చు. మరి ఈటీవీ విన్.. ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ కు ఇస్తుందో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×