BigTV English

Kiran Abbavaram : ఏంటన్నా.. కాపురాల్లో చిచ్చుపెట్టేస్తున్నావే.. హీరోపై నెటిజన్స్ ట్రోల్స్…

Kiran Abbavaram : ఏంటన్నా.. కాపురాల్లో చిచ్చుపెట్టేస్తున్నావే.. హీరోపై నెటిజన్స్ ట్రోల్స్…

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ‘క ‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ కథ డిఫరెంట్ గా ఉండటంతో ప్రేక్షకులు మన్ననలు అందుకుంది. ఈ మూవీ తర్వాత ‘దిల్ రుబా’ ( Dil Ruba ) అనేచిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోష్ ని పెంచింది. ప్రెస్ మీట్లను నిర్వహించడంతోపాటుగా పలు ఛానల్ ఇంటర్వ్యూలో కూడా తమ సినిమాని ప్రమోట్ చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఈవెంట్ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. హీరో పై ట్రోల్స్ వేసేలా ఏం అన్నాడో ఒకసారి తెలుసుకుందాం..


హీరో వ్యాఖ్యల పై నెటిజెన్స్ ట్రోల్స్ ..

కిరణ్ అబ్బవరం దిల్ రుబా మూవీలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని మార్చి 14 న రిలీజ్ చెయ్యనున్నారు.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరుని పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా ఫ్రెండ్‌షిప్‌తో బయటికి వస్తారు అంటూ చెప్పుకోచ్చాడు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ చెప్పుకోచ్చాడు. అయితే కిరణ్ కామెంట్లపై నెటిజన్లు వింతంగా స్పందిస్తున్నారు.. ఎక్స్ లకు పెళ్లి అయిపోతే వాళ్ళ భార్యలని లేదా భర్తలని ఒప్పిస్తారా అని నెట్టింట ఆడేసుకుకుంటున్నారు. మరి దీనిపై కిరణబ్బవరం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Also Read : భర్తతో విడిపోవడం బాధగా ఉంది.. సడెన్ గా ఇంత మార్పేంటి..?

దిల్ రుబా ట్రైలర్..

తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో వాల్యూ లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. హీరో ప్రెజెంట్లో ఒక ప్రాబ్లమ్లో ఉండటం.. దాన్ని సాల్వ్ చేయడానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతను చదువుకునే కాలేజీకి రావడం.. అసలు వీళ్ళ గతం ఏంటి? ఎందుకు వీళ్ళు విడిపోయారు? అసలు హీరోకి ప్రెజెంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం చాలా అగ్రేసివ్గా కనిపిస్తున్నాడు.. అతని డైలాగ్ డెలివరీ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలను గుర్తుచేసే విధంగా ఉంది. సినిమాలో చాలా విజువల్స్ పూరి సినిమాలను గుర్తుచేస్తున్నాయి.. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×