BigTV English

Niharika Konidela : భర్తతో విడిపోవడం బాధగా ఉంది.. సడెన్ గా ఇంత మార్పేంటి..?

Niharika Konidela : భర్తతో విడిపోవడం బాధగా ఉంది.. సడెన్ గా ఇంత మార్పేంటి..?

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక (Niharika Konidela ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఒకప్పుడు యాంకర్ గా, తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ ఒక్క సినిమా కూడా మీకు స్టార్ ఇమేజ్ ని అందివ్వలేదు. ఇక సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కెరీర్ పై ఫోకస్ పెట్టింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయింది. ప్రస్తుతం సోలో లైఫ్ ని లీడ్ చేస్తున్న నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటు తన మూవీస్ అప్డేట్స్ గురించి కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ నిహారిక తన భర్త గురించి ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మెగా డాటర్ నిహారిక పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో స్టార్ హీరోయిన్ అవుతుందని మెగా ఫాన్స్ అందరు అనుకున్నారు కాకపోతే ఆమె ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది.. సినిమాలకు దూరమై పెళ్లి పీటలు ఎక్కింది. టెకీ చైతన్య జొన్నలగడ్డ తో ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వివాహబంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే ఉంది ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు ఊపొందుకున్నాయి.. అనుకున్నట్లుగానే కొద్దిరోజుల తర్వాత మేమిద్దరం విడిపోయాం అంటూ ప్రకటించారు.

నిహారిక విడాకులపై సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంత మంచి భర్తని ఎందుకు కాదనుకుంది ఎందుకు విడిపోయింది అసలు మెగా ఫ్యామిలీ లో ఆడపిల్లలకు భర్తలతో కాపురాలు చేయరా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో ఆమెపై మరోసారి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. విడాకులతో తన కలత గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ అమ్మాయికైన బాధాకరమైన అనుభవం అని నిహారిక అంగీకరించింది. విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉందని అంది. నిహారిక మాటలు విన్న నెటిజన్లు భర్తతో కలిసిపోయే ప్రయత్నాలు చేస్తున్నావా? ఎందుకింత పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. దీనిపై నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..


కెరీర్ విషయానికొస్తే..నిహారిక బాధాకరమైన ఘటన నుంచి బయటపడి పూర్తిగా తన కెరీర్ పైన ఫోకస్ పెట్టింది. కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ వస్తుంది. బ్యానర్ పై వచ్చిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్ళు భారీ విజయాన్ని అందుకుంది. అలాగే తమిళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానికైతే నిహారిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×