BigTV English

Best Summer Destinations: సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేష్స్ ఇవే!

Best Summer Destinations: సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేష్స్ ఇవే!

వేసవి సెగలు మొదలయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు కూడా మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ హాలీడేస్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సమ్మర్ లో చిల్ అయ్యేందుకు టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చల్లని హిల్ స్టేషన్లు, ప్రశాంతమైన బీచ్‌ లు, అడ్వెంచరస్ ప్లేసెస్, ఫారిన్ వెకేషన్స్ కు వెళ్లాలనుకుంటే.. హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


1.హిల్ స్టేషన్లు

వేసవి తాపం నుంచి చల్లగా రీఫ్రెష్ కావాలంటే హిల్ స్టేషన్లలో ఎంజాయ్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి వెళ్లే బెస్ట్ హిల్స్ స్టేషన్స్ ఇవే..  .


⦿ ఊటీ, తమిళనాడు – 850 కి.మీ

ఆకట్టుకునే ప్రకృతి అందాలకు కేరాఫ్ ఊటీ. తేయాకు తోటలు, కూల్ వెదర్, అందమైన సరస్సులకు అలరిస్తాయి.

⦿ కూర్గ్, కర్ణాటక – 830 కి.మీ

ఇండియన్  స్కాట్లాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది కూర్గ్. పచ్చని కాఫీ తోటలు, జలజల పారే జలపాతాలు, ట్రెక్కింగ్ ప్రదేశాలను అందరినీ ఆకట్టుకుంటాయి.

⦿ మున్నార్, కేరళ – 1,050 కి.మీ

కేరళలోని మున్నార్ సమ్మర్ వెకేషన్ కు బెస్ట్ డెస్టినేషన్. టీ తోటలు, పొగమంచు కొండలు, వన్యప్రాణుల అభయారణ్యాలు కనువిందు చేస్తాయి.

⦿ అరకు లోయ, ఆంధ్రప్రదేశ్ – 720 కి.మీ

పొరుగు రాష్ట్రం ఏపీలోని అరకు సమ్మర్ వెకేషన్ కు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పచ్చని అడవులు, చక్కటి  జలపాతాలు, గిరిజన సంస్కృతితో కూడిన సుందరమైన లోయ అలరిస్తుంది.

⦿ లంబసింగి, ఆంధ్రప్రదేశ్ – 570 కి.మీ

ఆంధ్రా కాశ్మీర్ గా పిలిచే లంబసింగి దేశంలో మంచు కురిసే ప్రదేశాల్లో ఒకటి. వేసవి తాపం నుంచి బయటపడాలనుకునే వాళ్లు ఇక్కడికి వెళ్లడం బెస్ట్.

⦿ చిక్మగళూరు, కర్ణాటక – 660 కి.మీ

కాఫీ ప్రియులకు స్వర్గధామం అయిన చిక్మగళూరు ఉత్కంఠభరితమైన కొండలు, ట్రెక్కింగ్ ట్రైల్స్, జలపాతాలు ఆకట్టుకుంటాయి.

2.బీచ్ లు  

సముద్రాన్ని ఇష్టపడే వారు బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ను ఎంచుకోవచ్చు.

⦿ గోవా – 660 కి.మీ

దేశంలోని పర్యాటక ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది గోవా. అందమైన బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్,  ఉత్సాహభరితమైన నైట్ లైఫ్‌ను అందిస్తాయి.

⦿ పాండిచ్చేరి – 780 కి.మీ

ఈ పట్టణంలోని ప్రశాంతమైన బీచ్‌లు, వాస్తుశిల్పాలు, యోగా రిట్రీట్‌లను అందిస్తుంది. పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

⦿విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – 620 కి.మీ

ఆర్‌కె బీచ్ నుంచి అరకు లోయ వరకు వైజాగ్ అందాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తాయి.

3.అడ్వెంచర్స్, వైల్డ్ యానిమల్స్

థ్రిల్ కోరుకునేవారికి ఈ అడ్వెంచర్స్, వైల్డ్ యానిమల్ డెస్టినేషన్స్ ను ఎంచుకోవచ్చు.

⦿ దండేలి, కర్ణాటక – 590 కి.మీ

రివర్ రాఫ్టింగ్, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్‌ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. దండేలి సాహస యాత్రలకు స్వర్గధామంగా చెప్పుకోవచ్చు.

⦿ కబిని, కర్ణాటక – 770 కి.మీ

పులులు, చిరుతలు, ఏనుగులను చూడటానికి సౌత్ ఇండియాలోని బెస్ట్ డెస్టినేషన్ కబిని.

⦿ మారేడుమిల్లి, ఆంధ్రప్రదేశ్ – 430 కి.మీ

పచ్చని అడవులు, జలపాతాలు, పర్యావరణ, పర్యాటక రిసార్ట్‌ లతో ఆకట్టుకుంటుంది.

⦿ శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ – 230 కి.మీ

దట్టమైన అడవులు, అద్భుమైన డ్యామ్ తో పాటు ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ధిల్లుతోంది శ్రీశైలం. ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేయడంతో పాటు దైవ భక్తి మరియు ప్రకృతి విహారయాత్రకు అనువైనది.

⦿ హంపి, కర్ణాటక – 370 కి.మీ

పురాతన శిల్పాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. .

4.ఫారిన్ వెకేషన్స్

ఒకవేళ మీరు ఫారిన్ వెకేషన్స్ కు వెళ్లాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే..

⦿ శ్రీలంక (కొలంబో) -1,350 కి.మీ (విమానం: 2.5 గంటలు)

చక్కటి బీచ్ లు, పురాతన దేవాలయాలు, అందమైన టీ తోటలు ఆకట్టుకుంటాయి.

⦿ థాయిలాండ్ (ఫుకెట్, క్రాబీ, బ్యాంకాక్) – 2,500 కి.మీ (విమానం: 3.5 గంటలు)

థాయిలాండ్ ద్వీపాలు అద్భుమైన బీచ్ లు, ఆకట్టుకునే రిసార్ట్స్ ఆహ్లాదాన్ని అందిస్తాయి.

⦿ బాలి, ఇండోనేషియా – 5,000 కి.మీ (విమానం: 6.5 గంటలు)

బీచ్‌లు, జలపాతాలు, అద్భుమతైన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి.

⦿ దుబాయ్, యుఎఇ – 2,500 కి.మీ (విమానం: 4 గంటలు)

ఎడారి సఫారీలు, షాపింగ్, ప్రపంచ స్థాయి కట్టడాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

⦿ మాల్దీవులు –  2,000 కి.మీ (విమానం: 3.5 గంటలు)

చక్కటి బీజ్ లు, ఓవర్‌ వాటర్ విల్లాలు అలరిస్తాయి.

Read Also: మన రూపాయి అక్కడ 500తో సమానం, అలా చేస్తే జైల్లో చిప్పకూడు తినాల్సిందే!

Tags

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×