BigTV English
Advertisement

Nithin : ప్రైవేట్ బాత్‌రూంలో కూడా వదలడం లేదు… డైరెక్టర్‌పై నితిన్ అసహనం..!

Nithin : ప్రైవేట్ బాత్‌రూంలో కూడా వదలడం లేదు… డైరెక్టర్‌పై నితిన్ అసహనం..!

Nithin.. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ప్రమోషన్స్ జోరు బాగా పెంచిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత ఇంపాక్ట్ సినిమా ఫలితం పై పడుతుందనేది అందరి విశ్వాసం. ఇక ఇదే విషయాన్ని దిగ్గజ దర్శకులు రాజమౌళి (Rajamouli ) చాలా గట్టిగా నమ్ముతారు. సినిమా ఎలా ఉన్నా సినిమాను ప్రజలలోకి చేరవేస్తే.. ఆటోమెటిగ్గా సినిమా సక్సెస్ అవుతుందనేది ఆయన విశ్వాసం అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే దారిలోనే చాలామంది సెలబ్రిటీలు ప్రమోషన్స్ ను వేగంగా.. ప్రజలకు రీచ్ అయ్యేలా చేపడుతున్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది డైరెక్టర్లు ప్రమోషన్స్ కోసం లక్షల రూపాయలను ఖర్చు చేయకుండా కేవలం అతి తక్కువ ఖర్చులోనే ప్రమోషన్స్ చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) తర్వాత డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky kudumula) ఆ లిస్టులోకి వచ్చి చేరిపోయారని తెలుస్తోంది.


Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ లో బాలీవుడ్ నటుడు.. ప్రత్యేక శిక్షణ అంటూ క్లారిటీ..!

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబిన్ హుడ్.. స్పెషల్ సాంగ్ లో కేతిక..


ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వెంకీ కుడుముల నితిన్ (Nithin) తో కలిసి రాబిన్ హుడ్ (Robinhood) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే అందాలతార కేతికాశర్మ (Kethika Sharma) ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కూడా మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాలో పాటలకు జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతాన్ని అందించగా.. శేఖర్ మాస్టర్ (Sekhar Master) నృత్యాలు కంపోజ్ చేశారు. “అధి ధా సర్ప్రిసు” అనే టైటిల్ తో చంద్రబోస్ ఈ పాటను రాశారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.

ప్రైవేట్ బాత్రూంలో కూడా హీరోని వదలని డైరెక్టర్..

ఇదిలా ఉండగా.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ వెంకీ కుడుముల నితిన్ ని ప్రైవేట్ బాత్రూంలో కూడా వదలడం లేదు అన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నితిన్ ప్రమోషన్స్ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో హీరో నితిన్ ఎక్కడ ఉంటే అక్కడ వెంకీ కుడుముల సినిమా ప్రమోషన్స్ మొదలు పెడదామా అంటూ విసిగించడం మనం చూడవచ్చు. జిమ్ కి వెళ్తే అక్కడ ..టీవీ చూస్తూ ఉంటే సడన్గా టీవీలో.. ఆఖరికి ప్రైవేట్ బాత్రూంలో కూడా వెంకీ కుడుముల నితిన్ ని వెంటాడుతున్న వీడియో మనకి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక నితిన్ ఎక్కడికి వెళ్లినా వెంకీ కుడుముల నన్ను వదలడం లేదు అంటూ ఏడుస్తున్న ఏమోజిని కూడా షేర్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఫ్రీ ప్రమోషనల్ అని కూడా తెలుస్తోంది.

అనిల్ రావిపూడిని బాగా ఫాలో అవుతున్న వెంకీ కుడుముల..

ముఖ్యంగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ అనిల్ రావిపూడిని బాగానే ఫాలో అవుతున్నాడు వెంకీ కుడుముల. ప్రమోషన్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. హీరోను బాగా వాడుకుంటున్నాడు. అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×