E-Paper
Advertisement

డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 బ్రాండ్స్ ఇవే

డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 బ్రాండ్స్ ఇవే
Advertisement

Best dishwasher brands in India: ఇంట్లో వంట చేయడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత జిడ్డు గిన్నెలు కడగడం మరో ఎత్తు. ముఖ్యంగా ఆయిల్‌, మసాలాలు ఎక్కువగా ఉండే  పాత్రలను క్లీన్ చేయడం పెద్ద టాస్క్. అందుకే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో డిష్‌వాషర్స్ నిత్యావసరంగా మారిపోయాయి. మరి మార్కెట్లో ఉన్న వందలాది ఆప్షన్లలో ఏది బెస్ట్? డైలీ వాడకానికి  తట్టుకుని, గిన్నెలను తళతళలాడించే ఆ టాప్ 5 డిష్‌వాషర్ బ్రాండ్లు ఏంటో ? వాటి స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో టైమ్ సేవ్ చేసుకోవడానికి, చేతుల నొప్పుల నుంచి తప్పించుకోవడానికి డిష్‌వాషర్ సూపర్ ఆప్షన్. స్మార్ట్ ఫీచర్స్, తక్కువ వాటర్ లో బాగా ట్రెండ్ అవుతున్న 5 బెస్ట్ బ్రాండ్స్ డీటెయిల్స్..

1. Bosch (బాష్) :

Advertisement

డిష్‌వాషర్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ‘బాష్’. జర్మన్ టెక్నాలజీతో వచ్చే ఈ బ్రాండ్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇందులో ఉండే ‘Intensive Kadhai’ ప్రోగ్రామ్ మన జిడ్డు కడాయిలు, కుక్కర్లను క్లీన్ చేయడానికి స్పెషల్‌గా డిజైన్ చేశారు. 70°C వేడి నీటితో గిన్నెలను కడగడం వల్ల 99.9% బ్యాక్టీరియా నశిస్తుంది. దీనిలోని ‘EcoSilence Drive’ వల్ల అస్సలు శబ్దం రాదు.

2. IFB (ఐఎఫ్‌బీ):

ఇండియన్ కిచెన్స్ పల్స్ తెలిసిన బ్రాండ్ ఐఎఫ్‌బీ. మన వంట పద్ధతులు, పాత్రల సైజులకు తగ్గట్టుగా వీరి డిష్‌వాషర్స్ ఉంటాయి. చాలా ఏరియాల్లో హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్య ఉంటుంది కదా? ఐఎఫ్‌బీ లో ఉండే వాటర్ సాఫ్ట్నర్ టెక్నాలజీ నీటిని సాఫ్ట్ చేసి, గిన్నెలపై తెల్లటి మచ్చలు పడకుండా చూస్తుంది.’Steam Drying’ ఫీచర్ వల్ల గిన్నెలు కడిగిన వెంటనే తడి లేకుండా పూర్తిగా ఎండిపోయి బయటకు వస్తాయి.

3.LG (ఎల్జీ) :

Advertisement

మీరు టెక్నాలజీని ఇష్టపడే వారైతే ఎల్జీ డిష్‌వాషర్ పర్ఫెక్ట్ ఛాయిస్. మీ ఫోన్ నుంచే దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనికి ‘QuadWash’ టెక్నాలజీ ఉంది. అంటే సాధారణ వాషర్లలా కాకుండా, నాలుగు వైపుల నుంచి వాటర్ స్ప్రే అవుతుంది. దీని వల్ల మూలల్లో ఉన్న జిడ్డు కూడా వదిలిపోతుంది. TrueSteam టెక్నాలజీతో గ్లాస్ ఐటమ్స్ ఎలాంటి గీతలు పడకుండా మెరుస్తాయి. ‘ThinQ’ యాప్ ద్వారా వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు.

4. Voltas Beko (వోల్టాస్ బెకో):

టాటా వారి వోల్టాస్, యూరోపియన్ బ్రాండ్ బెకో కలిసి అందిస్తున్న ఈ డిష్‌వాషర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు వీళ్ల సొంతం. కౌంటర్‌టాప్ (చిన్న సైజ్) మోడల్స్ నుంచి ఫుల్ సైజ్ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి.తక్కువ స్పేస్ ఉన్న కిచెన్స్‌కు ఇది బెస్ట్.’TrayWash’ ఫీచర్ ఆయిల్ ఎక్కువగా ఉండే పాత్రలను ఈజీగా క్లీన్ చేస్తుంది. బడ్జెట్ పరంగా చాలా రీజనబుల్.

Also Read: టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలా? ఎల్‌జి,హైయర్లలో ఏది బెస్ట్ చాయిస్?

5. Samsung (శాంసంగ్):

మోడ్రన్ మోడ్యులర్ కిచెన్ లుక్ కోసం శాంసంగ్ డిష్‌వాషర్స్ కేరాఫ్ అడ్రస్.వీటి డిజైన్ చాలా ప్రీమియంగా, ట్రెండీగా ఉంటుంది. దీనిలోని ‘IntensiveWash’ సిస్టమ్ మాడిపోయిన మచ్చలను, అన్నం గిన్నెలకు అంటుకుపోయే గట్టి మరకలను సులువుగా వదిలిస్తుంది.ఫ్లెక్సిబుల్ రాక్స్ ఉండటం వల్ల పెద్ద పెద్ద గిన్నెలను కూడా మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు.

చాలా మంది డిష్‌వాషర్ వాడితే కరెంట్, వాటర్ బిల్స్ ఎక్కువగా వస్తాయనుకుంటారు. కానీ నిజానికి చేత్తో కడిగితే 40 నుంచి 60 లీటర్ల నీరు వేస్ట్ అవుతుంది. అదే డిష్‌వాషర్ కేవలం 9 నుంచి 12 లీటర్ల నీటితోనే పని పూర్తి చేస్తుంది. 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడల్స్ వాడటం వల్ల కరెంట్ బిల్లు కూడా నెలకు చాలా తక్కువగా వస్తుంది. మీ ఫ్యామిలీ సైజ్ (3-4 గురు ఉంటే 13 ప్లేస్ సెట్టింగ్స్), బడ్జెట్‌ను బట్టి పై ఐదింటిలో ఒక బెస్ట్ బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇక గిన్నెల గోలకి గుడ్‌బై చెప్పేయండి.

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×