BigTV English

Jr.NTR: మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి ?దాని ప్రత్యేకత ఏంటంటే..?

Jr.NTR: మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి ?దాని ప్రత్యేకత ఏంటంటే..?

Jr.NTR..యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. అవసరానికి తగ్గట్టుగా శరీరంలో మార్పులు తీసుకొస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ‘స్టూడెంట్ నెంబర్ -1’, ‘సింహాద్రి’ వంటి చిత్రాలలో ఎంత లావుగా కనిపించి ఆకట్టుకున్నారో.. ఆ తర్వాత వచ్చిన ‘కంత్రి’ , ‘అదుర్స్’ సినిమాలలో కరెంట్ తీగలా మారిపోయి అబ్బురపరిచారు. ఇక ‘యమదొంగ’ సినిమా కోసం మళ్ళీ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతెందుకు ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ సినిమాలలో కూడా తన మేకోవర్తో ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్.. ఇప్పుడు సడన్ గా సన్నబడిపోయి మరొకసారి అభిమానులకు షాక్ కలిగించారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ ను గమనించినట్లయితే.. ఈయన ఈజీగా బరువు పెరగగలరు అలాగే తగ్గగలరు కూడా..


మ్యాడ్ స్క్వేర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్..

ఇకపోతే ఎన్టీఆర్ తన, మన అని తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉండే అందరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరైనా ఎదగాలని కోరుకున్నప్పుడు వారికి సపోర్ట్ చేస్తారు కూడా.. ఈ క్రమంలోనే తన బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) హీరోగా నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మ్యాడ్ స్క్వేర్ చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు ఎన్టీఆర్. ఇక ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్, ఫోటోలు, వీడియోలు.. అంతే కాదండోయ్ తన బావమరిది నార్నే నితిన్ తో ఎన్టీఆర్ చేసిన అల్లరి అన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇందుకు సంబంధించిన ప్రతి విషయం కూడా నెట్టింట వైరల్ గా మారింది.


ఎన్టీఆర్ తాగిన వాటర్ బాటిల్ ఖరీదు రూ.165..

అలా ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన తాగిన డ్రింక్ బాటిల్ కూడా ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సెపరేట్ గా ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఒక డ్రింక్ తాగాడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చెక్కర్లు కొట్టడంతో అసలు ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింక్ ఏంటి? ఆ బాటిల్ ధర ఎంత? దాని ప్రత్యేకత ఏంటి ? అని నెటిజన్లు కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింక్.. పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్ అని సమాచారం. అంటే ఇది కేవలం నీళ్లు మాత్రమే. 330ML బాటిల్స్ లో ఇది దొరుకుతుంది. సుమారుగా రూ.165.. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 1992 నుండి అందుబాటులో ఉంది. ముఖ్యంగా 140 దేశాలలో ఫ్రాన్స్ కి చెందిన ఈ కంపెనీ ఈ మినరల్ వాటర్ ను విక్రయిస్తున్నారు. సాధారణంగా డైట్ లో ఉన్న వారు మాత్రమే ఎక్కువగా ఈ వాటర్ ను తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం బరువు తగ్గడానికి ఆయన డైట్ మెయింటైన్ చేస్తున్నారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికి అయితే ఎన్టీఆర్ తాగిన ఈ వాటర్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×