SCR Trains Cancelled: సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మెయింటెనెన్స్ పనుల కారణంగా 7 రైళ్లను రద్దు చేయడంతో పాటు 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రైళ్లన్నీ కాచిగూడ, నిజామాబాద్ మీదుగా ప్రయాణించనున్నట్లు వెల్లడించింది.
రద్దు చేయబడిన 7 రైళ్లు ఇవే!
⦿ కాచిగూడ- నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77601 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 30 వరకు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
⦿ నిజామాబాద్- హెచ్ఎస్ నాందేడ్ మధ్య నడిచే రైలు నంబర్ 77602 ఏప్రిల్ 14,15, 17, 28, 21, 22, 24 తేదీలలో రద్దు చేశారు.
⦿ హెచ్ఎస్ నాందేడ్- నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేయబడింది.
⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేశారు.
⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో క్యాన్సిల్ చేశారు.
⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేశారు.
⦿ పుదుచ్చేరి- తిరుపతి మధ్య నడిచే రైలు నంబర్ 77646 ఏప్రిల్ 5న రద్దు చేశారు. అటు తిరుపతి- పుదుచ్చెరి రైలు ఏప్రిల్ 6న క్యాన్సిల్ చేశారు.
⦿ ఏప్రిల్ 5న యశ్వంత్ పూర్- బీదర్ మధ్య నడిచే రైలును (16577) రద్దు చేశారు.
Read Also: తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లు
⦿ కాచిగూడ నుంచి మెదక్ కు వెళ్లే 77603 రైలును ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 30 వరకు కాచిగూడ, మల్కాజ్ గిరి మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
⦿ దౌండ్ నుంచి నిజామాబాద్ వైపు నడిచే 11409 రైలు ఏప్రిల్ 13, 14, 16, 17, 20, 21, 23, 24, 27, 28 తేదీలలో ముధేడ్, నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.
⦿ నిజామాబాద్ నుంచి పంధర్ పూర్ వైపు నడిచే 11413 రైలు ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో నిజామాబాద్, ముధేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. మెయింటెనెన్స్ పనులు పూర్తి అయిన తర్వాత ఆయా రైళ్లు యథావిధిగా తమ సర్వీసులను అంధిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. ఇకపై చర్లపల్లి మీదుగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ రాకపోకలు!