BigTV English

Keerthy suresh: మహానటి కట్నంగా ఎంత తీసుకెళ్తోందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.!

Keerthy suresh: మహానటి కట్నంగా ఎంత తీసుకెళ్తోందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.!

Keerthy suresh: ప్రస్తుతం ఇండియన్ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు.ఇప్పుడు మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రధమంగా వినిపిస్తున్న అంశం కట్నం. తల్లిదండ్రులు స్టార్ సెలబ్రిటీలు.. ఇక ఈమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. పైగా బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది. ఈ సమయంలో కట్నం గా ఎంత తీసుకెళ్తోంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ దుబాయ్ లో బిజినెస్ మాన్ అయిన ఆంటోనీ తట్టిల్ ను వివాహం చేసుకోబోతోంది. వేలకోట్లు సంపాదించిన అంటోనీ, కీర్తి సురేష్ కి చిన్నప్పటినుంచే స్నేహితుడట. ఈ నేపథ్యంలోనే ప్రేమించుకున్న వీరిద్దరూ.. డిసెంబర్ 11, 12 తేదీలలో గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకోబోతోందని సమాచారం.. ఇకపోతే పెద్ద కుటుంబానికి కీర్తి సురేష్ కోడలుగా వెళ్లబోతున్న నేపథ్యంలో ఆమె కట్నం ఎంత ఇస్తుంది? అనే అంశంపై అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేలకోట్ల ఆస్తి ఉన్న ఆంటోనీ కీర్తి సురేష్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి సముఖంగా లేరని సమాచారం.


కట్నం కింద వందల కోట్లు..

అయితే ఆమె తల్లిదండ్రులైన.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక(Menaka), ప్రముఖ నిర్మాత జి. సురేష్ (G.Suresh)తమ కూతురికి కట్నం కింద తమ ఆస్తిలో సగ భాగాన్ని రాసి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాదులో ఉన్న ప్రాపర్టీస్ తో పాటు చెన్నైలో ఉన్న రెండు బంగ్లాలను కూడా ఆమెకు కట్నం కింద ఇవ్వబోతున్నారట. అంతేకాదు కూతురి పెళ్లి కోసం ఇప్పటివరకు దాచిన బంగారాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే మహానటి కీర్తి సురేష్ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను కట్నం కింద తీసుకెళ్తోందని సమాచారం.

15 సంవత్సరాలుగా పరిచయం..

ఇక వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే విషయానికి వస్తే.. 15 సంవత్సరాల నుంచి వీరిద్దరూ కలిసి పెరిగినట్లు సమాచారం. అంతేకాదు ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారని సమాచారం. ముఖ్యంగా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరి మధ్య ఆ స్నేహం బాగా పెరగడం వల్లే, అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వెళ్తున్నట్లు సమాచారం.

కీర్తి సురేష్ కెరియర్..

కీర్తి సురేష్ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె , ఆ తర్వాత ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఇన్నోసెన్స్ గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక నాని సరసన ‘దసరా’ సినిమాలో నటించి, డీ గ్లామరస్ పాత్రతో కూడా మెప్పించింది. అంతేకాదు ఈ పాత్రకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే నిన్న మొన్నటి వరకు సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఉన్నట్టుండి ఒక్కసారిగా గ్లామర్ డాల్ గా మారిపోయింది. తన అందాలు బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కీర్తి సురేష్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×