Transgenders US Military| అగ్రరాజ్యం అమెరికా తదుపది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు (లింగమార్పిడి చేసుకున్నవారి) షాకిచ్చారు. త్వరలోనే అమెరికా మిలిటరీలో పనిచేసే ట్రాన్స్‌జెండర్స్ అందరినీ తొలగించేవిధంగా చట్టం తీసుకురాబోతున్నారు. అమెరికా వార్తా పత్రిక కథనం ప్రకారం.. మిలిటరీ అధికారులు ట్రాన్స్‌జెండర్స్‌ని సైన్యంలో పనిచేసేందుకు వైద్యపరంగా అనర్హులు ప్రకటించడం జరుగుతుంది. ఈ వార్తతో అమెరికాలోని మొత్తం ట్రాన్స్‌జెండర్స్ (LGBTQIA+) సమాజం ఆందోళనలో పడింది.
అంతకుముందు ట్రంప్ మొదటిసారి 2016-2020 మధ్య అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన ట్రాన్స్‌జెండర్స్‌ని సైన్యంలో చేరేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే సైన్యంలో ఉన్నవారిని కొనసాగించారు. కానీ జనవరి 20, 2024న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక.. సైన్యంలో ఉద్యోగం చేసేవారిని సైతం తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆదేశాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
అమెరికా సైన్యం ప్రస్తుతం 15000 మంది ట్రాన్స్‌జెండర్స్ సేవలు అందిస్తున్నారు. 2020 సంవత్సరంలో జో బైడెన్ అధ్యక్షుడు కాగానే ట్రంప్ విధించిన నిషేధాన్ని తొలగించారు. దీంతో గత నాలుగేళ్లలో దాదాపు 2,200 మంది ట్రాన్స్‌జెండర్స్ కొత్తగా సైన్యంలో చేరారు.
Also Read: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!
ఇంతకుముందు కూడా ట్రంప్ చాలాసార్లు ట్రాన్స్‌జెండర్స్ వల్ల సమాజానికి చాలా ప్రమాదమని చెప్పారు. ఆయన తొలిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో కూడా పిల్లలకు ట్రాన్స్‌జెండర్స్, రాజకీయాలు, జాత్యాహంకారం లాంటి అంశాల గురించి బోధించే లేదా ప్రోత్సహించే స్కూల్స్, కాలేజీలకు ఆర్థిక సాయం ఆపేస్తానని చెప్పారు.
ట్రంప్ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా ఎన్నికైన పీట్ హెగ్‌సెత్ కూడా అమెరికా మిలిటరీలో మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ని నియమించేందుకు వ్యతిరేకమని ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. నవంబర్ తొలి వారంలో ట్రంప్ మంత్రివర్గంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు తెల్లజాతి పిల్లలను లింగమార్పిడి చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయని అని అన్నారు. అలా చేసుకుంటే ఐవీ లీగ్స్ లో సభ్యత్వం లభిస్తుందనే ఆశచూపించి పిల్లలను ప్రేరేపిస్తున్నారని జో రోగన్ పాడ్ క్యాస్ట్‌లో చెప్పారు.
జె డి వాన్స్ పాడ్ క్యాస్ట్ ప్రొగ్రామ్ లో మాట్లాడుతూ.. “మీరు ఒక మధ్య తరగతి లేదా ఎగువ మధ్య తరగతి తెల్లజాతి వారైతే ముఖ్యంగా మీ పిల్లలు హార్వార్డ్ లేదా యేల్ లాంటి విద్యాసంస్థల్లో చదువుకోవాలని ఆశిస్తారు. కానీ ఎగువ మధ్యతరగతి పిల్లలకు ఇప్పుడు అలా చేయడం చాలా కష్టంగా మారింది. కానీ అలాంటి కుటుంబాలకు ఈ దేశంలో ట్రాన్స్‌జెండర్స్ గా మారేందుకు ప్రోత్సహిస్తున్నారు. అలా చేస్తే వారికి పెద్ద పెద్ద సంస్థల్లో అడ్మిషన్ లభిస్తుందని ఆశచూపుతున్నారు.” అని అన్నారు.