ఇటీవల ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman)సతీమణి సైరా భాను (Saira Banu)తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు లాయర్ ద్వారా ప్రకటించారు. ఇకపోతే మరో నాలుగు నెలలు గడిచి ఉంటే.. వీరి వివాహ బంధానికి మూడు దశాబ్దాల కాలం అయి ఉండేది. అయితే సడన్గా ఈ వయసులో విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ వయసు 57 ఏళ్లు. సైరాభాను వయసు 50 సంవత్సరాలు. దాదాపుగా వృద్ధాప్య వయసుకు వచ్చే సమయంలో విడాకులు ప్రకటించడంతో అందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
వృద్ధాప్య వయసులో విడాకులు ప్రకటించిన ఏ ఆర్ రెహమాన్..
దీనికి తోడు విడాకులు ప్రకటించారో లేదో మరోవైపు రెహమాన్ అసిస్టెంట్ కూడా విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సంథింగ్ ఏదో జరుగుతోంది అంటూ అప్పుడే సోషల్ మీడియాలో గుస గుసలు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఇకపోతే ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే. పెద్ద అమ్మాయి ఖతీజాకు వివాహం జరిగింది. చిన్నమ్మాయి రహీమా చెఫ్ గా ఈ ఏడాది బాధ్యతలు చేపట్టింది. ఇక అబ్బాయి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇంకా పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు విడాకులు తీసుకోవడంతో వారి బాధ్యతను ఎవరు తీసుకోబోతున్నారు.? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గోప్యతను కాపాడాలంటూ వేడుకున్న పిల్లలు..
ఇకపోతే 1995లో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట అప్పటి నుంచి సవ్యంగానే జీవితాన్ని కొనసాగించారు. కానీ 29 ఏళ్ల పాటు కలిసి ఉన్న వీరు ఇప్పుడు సడన్గా విడాకులు ప్రకటించారు. “ఇలాంటి కష్ట సమయంలో తమను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ” పోస్ట్ పెట్టారు. అలాగే వీరి పిల్లలు కూడా..” తమ తల్లిదండ్రుల విడాకులపై గోప్యతను గౌరవిస్తారని, తమను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది.
సైరాభానుకి భరణం కింద ఎన్ని కోట్లంటే..
ఈ క్రమంలోనే సైరా భాను భరణం కింద ఎంత తీసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే భరణం కింద సైరా భాను ఎంత తీసుకోబోతోంది అనే విషయం వైరల్ గా మారుతోంది. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ కి దాదాపు రూ .2000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. ఈ లెక్కన దీనిలో సగం వరకు సైరా భానుకు ఇవ్వాల్సి ఉంటుందని, ఆమె తరఫు లాయర్ వందనా షా (Vandana Sha) తెలిపారు.. మరోవైపు ఏఆర్ రెహమాన్ తన దగ్గర పనిచేస్తున్న బాసిస్ట్ సింగర్ మోహిని డే తో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే ఆమె కూడా రెహమాన్ భార్య సైరా భాను విడాకులు ప్రకటించిన వెంటనే తన భర్తకు ఆమె విడాకులు ఇచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రూ.1000 కోట్లు భరణంగా రాబోతున్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సైరా భాను , ఏ ఆర్ రెహమాన్ ఇద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకున్నారు. మరి వీరి విడాకులకు అసలు కారణమేంటో తెలియదు కానీ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.