Sankranthi Movies: తెలుగువారికి అతిపెద్ద పండగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. ఇక ఆ మూడురోజులు పండగ వస్తే చాలు.. ఇండస్ట్రీకి కాసుల పంటనే. అందుకే పెద్ద సినిమాలు కానీ, చిన్న సినిమాలు అని తేడా లేకుండా పండగ రేసులో ఉండాలని చూస్తారు. ఏడాది మొత్తం వచ్చిన సినిమాలు.. హిట్స్, ప్లాపులను పెద్దగా పట్టించుకోరు కానీ, సంక్రాంతి విన్నర్ అనే టైటిల్ కోసం మాత్రం ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తూనే ఉంటాడు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా ఒక హీరోను మించి ఇంకో హీరో.. సంక్రాంతికి తమ పుంజులను దింపుతున్నారు.
సంక్రాంతి 2025 కు వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం, డాకు మహారాజ్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఒక్క నిమిషం.. ఈ లిస్ట్ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందే. ఆల్రెడీ ఇలాంటి ఫైట్ నే గతంలో జరిగిందే అని అనుకుంటున్నారా.. ?అవును.. మీరు అనుకున్నది నిజమే.. ఇలాంటి ఒక ఫైట్ 2019 లో జరిగింది. ఈ నలుగురు హీరోలే 2019 లో సంక్రాంతికి పోటీ పడ్డారు.
Actress Renu Desai: రేణు దేశాయ్ కి మాతృవియోగం..!
ఇప్పుడు దాదాపు అయిదేళ్ల తరువాత ఇదే నలుగురు హీరోలు మళ్లీ సంక్రాంతి రేసులోకి దిగుతున్నారు. 2019 సంక్రాంతికి రామ్ చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ కథానాయకుడు, అజిత్ విశ్వాసం, వెంకటేష్ ఎఫ్ 2 రిలీజ్ అయ్యాయి. ఇక ఆ నాలుగు సినిమాల్లో వెంకటేష్ ఎఫ్ 2 .. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మిగతా మూడు సినిమాల్లో విశ్వాసం తమిళ్ ప్రేక్షకులను మెప్పించింది కానీ, తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కానీ, ఇదే సినిమా ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తండ్రికూతుళ్ళ మధ్య ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎన్నో అంచనాలతో వినయ విధేయ రామ థియేటర్ కు వెళ్లారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకొని థియేటర్ కు వెళ్లారు. కానీ, అర్ధం పర్థం లేని ఎలివేషన్స్.. అసలు లాజిక్స్ లేని సీన్స్ చేసి.. ఏందిరా ఈ సినిమా అని నెత్తినోరు బాదుకున్నారు. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లో వినయ విధేయ రామ కూడా ఒకటి. ఇక సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అన్నది ఒక ఆనవాయితీగా వస్తుంది అని చెప్పాలి.
Thandel: బుజ్జి తల్లులను బుజ్జగించే పాట.. ‘తండేల్’ నుండి లవ్ సాంగ్ విడుదల
ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య సినిమా లేని సంక్రాంతి అసలు పండగే కాదు అన్నది అభిమానుల అభిప్రాయం. 2019 బాలయ్యకు ఒక మరువలేని జ్ఞాపకం. దానికి కారణం.. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమాగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని కథానాయకుడు అనే పేరుతో రిలీజ్ చేయగా.. రాజకీయ జీవితాన్ని మహా నాయకుడు అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక కథానాయకుడు సినిమా సంక్రాంతి బరిలో దిగింది కానీ, ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక వెంకటేష్- వరుణ్ తేజ్ -అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం ఎఫ్ 2. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ నలుగురు హీరోలు 2024 సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. నట సింహం బాలకృష్ణ.. గాడ్ ఆఫ్ మాసెస్ గా మారాడు. ఇక వెంకీ మామ.. మధ్యలో చాలా హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలపైన ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
‘చిరుత’ బ్యూటీ బర్త్ డే స్పెషల్.. తన గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
ఇక ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. 2019 లో ఎఫ్ 2 తో వచ్చిన వెంకీ – అనిల్ కాంబో ఈసారి 2024 లో కూడా రావడమే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది.ఇక ఈ సంక్రాంతికి ఇదే విన్నర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ బల్లగుద్ది చెప్పుకొస్తున్నారు. దీంతో పాటు బాలకృష్ణ- బాబీ కాంబోలో వస్తున్న డాకు మహారాజ్ పై కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. అది కూడా పీరియాడిక్ కథాంశంతో రానుండడం, సంక్రాంతి విన్నర్ అంటే బాలయ్య అని ప్రేక్షకులు నమ్మడం.. ఇలా ఇది కూడా హిట్ అయ్యేలా ఉందని అంటున్నారు.
ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా హిట్ అయ్యే ఛాన్స్ లు లేకపోలేదు. అందుకు కారణం ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడమే. తెలుగులో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. ఒకవేళ కనుక 2019 రిపీట్ సెంటిమెంట్.. రిపీట్ అయితే కనుక.. వెంకీ మామనే మళ్లీ హిట్ అందుకుంటాడా.. ? లేక ఈసారి మారుతుందా.. ? అనేది చూడాలి.