BigTV English

Pattudala Trailer: పట్టుదల ట్రైలర్.. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా అదరగొట్టిన అజిత్

Pattudala Trailer: పట్టుదల ట్రైలర్.. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా అదరగొట్టిన అజిత్

Pattudala Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా ప్రముఖ రచయిత మగిళ్ తిరుమేని  దర్శకత్వం వహించిన చిత్రం విడాముయార్చి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా ఎంతో ప్రతిష్టాత్మాకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో  అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి.


గత కొంతకాలంగా తెలుగు – తమిళ్ మధ్య టైటిల్స్ విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఏ భాషలో రిలీజ్ అయ్యే సినిమాకు తగ్గట్టు ఆ భాషలోనే టైటిల్ ను పెట్టాలని  ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగువారు భాషా బేధం లేకుండా సినిమాలు చూసి ఆదరిస్తున్నప్పుడు.. కేవలం టైటిల్ మార్చినంత  మాత్రాన ఏమవుతుందని ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. కొన్నిసార్లు ఆ తమిళ్ టైటిల్స్ అర్ధం కాకనే చాలామందిథియేటర్స్ కు వెళ్లడం లేదు అన్నది నమ్మదగ్గ నిజం.

అజిత్ గత చిత్రాలు తెలుగులో హిట్ కాకపోవడానికి కారణం కూడా ఈ టైటిల్స్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వాలిమై, తునీవు అంటూ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక తునీవు సినిమాకు అయితే టైటిల్ విషయంలో పెద్ద గొడవనే అయ్యింది. తెలుగులో రేపు రిలీజ్ అనగా ఈరోజు తునీవు తెలుగు టైటిల్ ను తెగింపు అని మార్చారు. అయినా ఈ రెండు సినిమాలు తెలుగులో పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఈసారి విడాముయార్చి మేకర్స్ మాత్రం ముందే  ఈ విషయాన్ని గమనించి తెలుగులో మంచి పేరునే పెట్టుకొచ్చారు. విడాముయార్చి  సినిమా తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కానుంది.


Saif Ali Khan: ఖరీదైన కార్లు పెట్టుకొని సైఫ్ ను ఆటోలో తీసుకొచ్చిన కొడుకు.. ఎందుకో తెలుసా.. ?

ఇక పట్టుదల సినిమా ఫిబ్రవరి 6 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. అజిత్ ను మూడు డిఫరెంట్ గెటప్స్ లో చూపించారు. గతంలో ఈ సినిమా షూటింగ్ లోనే డూప్ లేకుండా ఛేజింగ్ సీన్స్ చేసి అజిత్ ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఈ ట్రైలర్ ఆ షాట్స్ నే చూపిస్తూనే ప్రారంభించారు.

ఎడారిలో అజిత్ కారు నడుపుతున్న విజువల్స్ తో  ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. వెంటనే అజిత్ – త్రిష లవ్ స్టోరీని చూపించారు. ఒక వేడుకలో అజిత్ ను చూసిన త్రిష మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి.. గొడవలతో ముగిసినట్లు చూపించారు. ఇక త్రిషను వదిలేసాక.. అజిత్ ఒక మిషన్ లో పాల్గొంటాడు. క్రైమ్ రేట్ లేని దేశంలో చ్రిమెస్ జరుగుతుండడం, వాటికి అర్జున్ కారణమని అజిత్ తెలుసుకుంటాడు.

ఇక అజిత్ ను మభ్యపెట్టడానికి అర్జున్ భార్య రెజీనా ట్రై చేస్తూ ఉంటుంది. అసలు అజిత్ దేనికోసం పోరాడుతున్నాడు.. ? త్రిష ఎందుకు అజిత్ ను వదిలేసింది .. ? చివరికి వాళ్లు కలుసుకుంటారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ మొత్తంలో అజిత్ చేసిన యాక్షన్స్ అన్ని డూప్  లేకుండా చేసినవే. మూడు గెటప్స్ లో తాలా అదిరిపోయాడు. ఇక ఈ సినిమాకు ఉన్న ఇంకో బలం అనిరుధ్. మ్యూజిక్ తోనే మెస్మరైజ్ చేసే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ .. అజిత్ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట  వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×