BigTV English

Vishwambhara: విశ్వంభర సెట్స్‌లో ఊహించని స్టార్.. 30 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో

Vishwambhara: విశ్వంభర సెట్స్‌లో ఊహించని స్టార్.. 30 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో

Chiranjeevi – Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఫ్లాప్ తర్వాత నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా పై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఈ తరుణంలో విశ్వంభర మూవీ సెట్స్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చారు.


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కానీ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు లేదు. ఎందుకంటే మెగాస్టార్ సినిమాలో అజిత్ నటిస్తున్నాడని ఆ ఫొటో చూసి అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదు. ఎందుకంటే విశ్వంభర మూవీ షూటింగ్ పక్కనే అజిత్ కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ కారణంగానే పక్కన పక్కనే ఉండి పలకరించుకోకుంటే బాగుండదేమో అని చిరంజీవిని కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇక అందుకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ అజిత్ గురించి ఇలా రాసుకొచ్చారు. ‘‘నిన్న సాయంత్రం విశ్వంభర సెట్స్‌లో స్టార్ గెస్ట్‌‌గా వచ్చి అజిత్ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా షూటింగ్ కూడా మా పక్కనే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత మేము కలిసాము. అనంతరం అజిత్‌తో అప్పటి జ్ఞాపకాలను అలా గుర్తుచేసుకున్నాను.


Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ అందం..

అజిత్ మొదటి సినిమా ‘ప్రేమ పుస్తకం’ ఆడియో లాంచ్ ఈవెంట్ నా చేతుల మీదుగా జరిగింది. ఆ జ్ఞాపకాలను ఇద్దరం మరోసారి నెమరువేసుకున్నాం. అలాగే అజిత్ సతీమణి షాలిని ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’మూవీలో నటించింది. ఆ మూవీలో చిన్న పిల్లల పాత్రలో ఆమె కూడా ఒకరు. అప్పటికీ ఇప్పటికీ అజిత్ ప్యూర్ హార్ట్ అలానే ఉంది’’ అంటూ చిరు పోస్ట్ చేశారు.

ఇక ఏముంది ఇలా ఫొటో పెట్టారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. మెగాస్టార్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఒక్క సారిగా కామెంట్ల వర్షం కురిపించారు. 30 ఏళ్ల తర్వాత ఇద్దరినీ ఇకే ఫ్రేమ్‌లో చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పటి అజిత్ ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్‌లో చిరు, అజిత్ కలిసి దిగిన ఫొటోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×