Kollywoodv ఇటీవల కాలంలో పలు సినీ ఇండస్ట్రీలలో సెలబ్రిటీలు స్వర్గస్తులవుతూ.. అభిమానులకు కన్నీటిని మిగులుస్తున్నారు.ముఖ్యంగా కొంతమంది సీనియర్ సెలబ్రిటీలు వయస్సు రీత్యా వృద్ధాప్య కారణంగా మరణిస్తే, మరికొంతమంది అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులవుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలామంది యువ దర్శకులు, హీరోలు ఆత్మహత్యలు చేసుకుని, అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక మొన్నటికీ మొన్న కన్నడ డైరెక్టర్ తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించగా.. ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన మరో డైరెక్టర్ పరమపదించారు. ఈయన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
ప్రముఖ కోలీవుడ్ సినీ డైరెక్టర్ సురేష్ సంగయ్య (Suresh Sangaiah) మరణించినట్లు స్నేహితులు వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సురేష్ సంగయ్య రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10 20 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు. సురేష్ సంగయ్య యువ దర్శకుడిగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అకాల మరణం పొందడంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
యంగ్ డైరెక్టర్ సురేష్ సంగయ్య దర్శకత్వం వహించిన చిత్రాలు..
2017 లో ‘ఒరు కిడైయిన్ కరుమను’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో విధార్థ్ హీరోగా నటించారు. రవినా రవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అంతేకాదు ఏడాది సత్య సోతనై అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాకుండా గత ఏడాది కమెడియన్ యోగి బాబు (Yogibabu)తో కూడా ఒక ఓటీటీ సినిమాని కూడా తెరకెక్కించారు. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటిటిలో కూడా సినిమాలు విడుదల చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.