EPAPER

Konda Surekha: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే, ఇదొక ఓపెన్ సీక్రెట్.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Konda Surekha: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే, ఇదొక ఓపెన్ సీక్రెట్.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Konda Surekha About KTR: నాగచైతన్య, సమంత విడాకులు అనేవి అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఉన్నట్టుండి సోషల్ మీడియా ద్వారా వారు విడిపోతున్నామని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది ఈ జంట. ఇప్పటికీ అసలు వీరు విడిపోవడానికి గల కారణమేంటి అని ఎక్కడా చెప్పలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత వీరి విడాకుల విషయంలో కొత్త ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ రాజకీయంగా మార్చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో నాగచైతన్య, సమంత విడాకుల గురించి మాత్రమే కాకుండా చాలామంది హీరోయిన్ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


అన్నింటికీ ఆయనే కారణం

‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే’’ అని ప్రకటించారు కొండా సురేఖ. దీంతో ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి విడాకుల విషయంలో మాత్రమే కాదు.. చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం కూడా కేటీఆరే అని ఆమె ఆరోపించారు. ‘‘ఈరోజుల్లో చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకొని సినీ పరిశ్రమ నుండి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే’’ అని అన్నారు. రాజకీయ పరంగా కేటీఆర్‌పై ఎంతోమంది ఎన్నో ఆరోపణలు చేసినా మొదటిసారి ఇండస్ట్రీలో హీరోయిన్లు ఆయన వల్లే కష్టాలు పడుతున్నారంటూ కొండా సురేఖ ఆరోపించారు.


Also Read: డబ్బులు తీసుకుని మోసం చేసింది… ‘యానిమల్’ హీరోయిన్ కొత్త వివాదం

హీరోయిన్లను బ్లాక్‌మెయిల్

‘‘కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి.. హీరోయిన్లను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి.. రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ల జీవితాలతో ఆడుకొని, వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసి, వాళ్లను ఇబ్బందిపెట్టిన వ్యక్తి కేటీఆర్. ఈ విషయం సినీ పరిశ్రమలోని అందరికీ తెలుసు. ఇదొక ఓపెన్ సీక్రెట్’’ అని కొండా సురేఖ ఓపెన్ స్టేట్‌మెంట్. దీంతో కేటీఆర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అసలు విషయం ఏంటని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. నిజంగానే సినీ పరిశ్రమలో ఇలా జరుగుతుందా అని నెటిజన్లు షాకవుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇవన్నీ అబద్ధపు ఆరోపణలు అయ్యిండొచ్చని కొట్టిపారేస్తున్నారు.

ఎవరైనా స్పందిస్తారా

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లో మాత్రమే కాదు సినీ పరిశ్రమలో కూడా దుమారం రేపాయి. దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు? అసలు నాగచైతన్య, సమంత దీనిపై స్పందించడానికి ముందుకొస్తారా? అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ప్రస్తుతం నాగచైతన్య, సమంత వారి వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. వీరిద్దరూ విడాకులు తీసుకొని మూడేళ్లు కావడంతో నాగచైతన్య.. హీరోయిన్ శోభితాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని సమంత విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఇక సమంత కూడా తన పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయి సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ కొండా సురేఖ చేసినవి మామూలు ఆరోపణలు కాదు కాబట్టి వీరిద్దరిలో ఎవరైనా దీనిపై స్పందిస్తారేమో చూడాలి.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×